Mana Shankara Varaprasad Garu Pre Release Business: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాల్లోనూ క్లోజ్ అయ్యాయి. చిరంజీవి గత సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం వల్లనో, లేకపోతే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు పోటీ ఉండడం వల్లనో తెలియదు కానీ, ఈ చిత్రానికి చాలా మీడియం రేంజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. మెగాస్టార్ రేంజ్ కి అది చాలా తక్కువ. స్టార్ హీరోలకు కూడా లేని విధంగా ఏకంగా మూడు సార్లు వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టిన చరిత్ర ఆయనది. అయినప్పటికీ కూడా అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ తో ఇంత తక్కువ బిజినెస్ జరగడం ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తుంది.
చిరంజీవి ఎంతో స్ట్రాంగ్ గా పిలవబడే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. అదే విధంగా మెగాస్టార్ కి కంచుకోట గా పిలవబడే సీడెడ్ ప్రాంతం లో కేవలం 18 కోట్ల రూపాయిల బిజినెస్ మాత్రమే జరగడం గమనార్హం. ఒక్క కోస్తాంధ్ర ప్రాంతం లోనే కాస్త డీసెంట్ రేంజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ వైజాగ్ , విజయవాడ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలకు కలిపి ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 100 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
పాజిటివ్ టాక్ వస్తే కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే బిజినెస్ ఇది. బయ్యర్స్ కి జాక్పాట్ తగిలినట్టే. ఇక నార్త్ అమెరికా లో ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే 20 కోట్ల రూపాయిల షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవ్వుద్ది అన్నమాట. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలిపి మరో పది కోట్లు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 130 కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. మెగాస్టార్ రేంజ్ కి ఇది తక్కువ బిజినెస్ అయినప్పటికీ, ఈ సంక్రాంతికి ఏకంగా 6 సినిమాలు పోటీ కి దిగుతుండడం వల్ల, డీసెంట్ రేంజ్ బిజినెస్ అనే చెప్పొచ్చు.