Mana Shankara Varaprasad Garu: ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో వార్ వన్ సైడ్ అయిపోయేలా చేసాడు. విడుదల రోజు నుండి నేటి వరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ ని చూసి వింటేజ్ మెగాస్టార్ స్టామినా ని మరోసారి గుర్తు చేసుకున్నారు ఫ్యాన్స్. వింటేజ్ మెగాస్టర్ సినిమా సూపర్ హిట్ అయితే అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూలు కడుతారు. వాళ్ళు ఒక్కసారి కదిలితే ఫుల్ రన్ కలెక్షన్స్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఆ రేంజ్ లో ఉంటుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి అదే రిపీట్ అయ్యింది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. ఇక నేడు అయితే ఈ చిత్రానికి గంటకు పది వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.
దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో అదనపు షోస్ ని కేటాయిస్తున్నారు. అవి నిమిషాల వ్యవధి లో హౌస్ ఫుల్స్ గా నమోదు అవుతున్నాయి. 14 వ రోజున ఒక సినిమాకు ఈ రేంజ్ హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం చూసి ఎన్ని రోజులైందో. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు మరింత థియేట్రికల్ రన్ రావాలనే ఉద్దేశ్యం తో మేకర్స్ త్వరలోనే ఈ సినిమా నుండి తొలగించిన కొన్ని కామెడీ సన్నివేశాలను జత చేయబోతున్నారట. అందులో బ్రహ్మానందం, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఒక సన్నివేశం ఉంటుంది. అదే విధంగా సెకండ్ హాఫ్ లో ఒక చిన్న బిట్ సాంగ్ కూడా ఉంటుందట. ఇవి వచ్చే వారం నుండి థియేటర్స్ లో ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు క్లిక్ అయితే కచ్చితంగా ఈ సినిమా థియేట్రికల్ రన్ మరో రెండు వారాలు అదనంగా రావొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఇకపోతే ఈ చిత్రం రేపటి తో వరల్డ్ వైడ్ గా 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రం గా నిలబడబోతుంది. నేటి తో ఉత్తరాంధ్ర ప్రాంతం లో 20 కోట్ల షేర్ మార్కుని కూడా అందుకోనుంది. ఈ ప్రాంతం లో ఇప్పటి వరకు ఈ మార్కుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ జాబితాలో చేరిపోయాడు. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఆ ప్రాంతం నుండి 22 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నాయి. మరి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ క్లబ్ ని చేరుకుంటుందా లేదా అనేది చూడాలి.