Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Varaprasad Garu centers list: 'మన శంకర వరప్రసాద్ గారు' 100 రోజుల...

Mana Shankara Varaprasad Garu centers list: ‘మన శంకర వరప్రసాద్ గారు’ 100 రోజుల సెంటర్స్ లిస్ట్ ఇదే.. ఊహకందని ర్యాంపేజ్ ఇది..

Mana Shankara Varaprasad Garu centers list: ‘భోళా శంకర్’ వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత, రెండేళ్ల సుదీర్ఘ విరామం తీసుకొని , మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో మన ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఫుల్ రన్ లో దాదాపుగా 304 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి , ఆల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఏకంగా దేవర , ఓజీ , సలార్ లాంటి చిత్రాల కలెక్షన్స్ ని కూడా అధిగమించింది ఈ చిత్రం. అంతే కాదు 109 కేంద్రాల్లో 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. మన టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుడో అంతరించిపోయిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ కూడా ఈ చిత్రం అన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు, 2 సెంటర్స్ లో 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఆ రెండు సెంటర్స్ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినవే అవ్వడం గమనార్హం. కడప జిల్లాలోని మైదుకూరు ప్రాంతం లో వెంకటేశ్వర థియేటర్ లో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకోగా, అదే కడప జిల్లాలోని యర్ర గుంట్ల సెంటర్ లో హేమ పిక్చర్ ప్యాలెస్ థియేటర్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈమధ్య కాలం లో ఒక సినిమా రాయలసీమ ప్రాంతం లో 100 రోజులు పూర్తి చేసుకోవడం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయం లోనే జరిగింది. ఈ రెండు ప్రాంతాల్లోని ఒక సెంటర్ లో మరికొన్ని రోజులు రన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

ఓటీటీ లోకి ఈ సినిమా ఎంట్రీ ఇచ్చి రెండు నెలలు అయ్యింది. టీవీ లో ఒకసారి టెలికాస్ట్ కూడా అయ్యింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతుందంటే , మెగాస్టార్ కి సరైన సినిమా పడితే ఎలాంటి సునామీ రన్ ఉంటుందో నేటి తరం ఆడియన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే గతం లో తనతో ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన బాబీ తో , చిరంజీవి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం త్వరలోనే జరగనుంది. ఈ సినిమా పై మార్కెట్ లో మామూలు క్రేజ్ లేదు. ఇకపోతే ఆయన హీరో గా నటించిన విజువల్ వండర్ ‘విశ్వంభర’ జూన్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular