Meesala Pilla Song Promo: సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చేస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న అంచనాలు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి. అనిల్ రావిపూడి ఫుల్ ఫార్మ్ లో ఉండడమే కాకుండా, చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేస్తుండడం వల్ల ఈ చిత్రం పై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడడానికి కారణం అయ్యింది. ఇకపోతే రీసెంట్ గా విడుదల చేసిన ‘మీసాల పిల్ల’ సాంగ్ ప్రోమో ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో నే కనిపిస్తుంది. చిరంజీవి గ్రేస్ స్టెప్పులతో పాటు, భీమ్స్ అందించిన క్యాచీ ట్యూన్ మొదటిసారి విన్నప్పుడే అబ్బా ఏముందిరా అని అనిపించింది.
యూట్యూబ్ లో ఒక ప్రోమో కి 6 మిలియన్ కి పైగా వ్యూస్ రావడం, ఇన్ స్టాగ్రామ్ లో ఆ ప్రోమో పై నాన్ స్టాప్ గా రీల్స్ చేయడం వంటివి గతం లో మనం ఎప్పుడూ కూడా చూడలేదు. ఆ రేంజ్ మేనియా ని క్రియేట్ చేసింది ఈ మీసాల పిల్ల ప్రోమో సాంగ్. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, షేర్ చాట్ మరియు ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో వచ్చిన వ్యూస్ అన్నిటిని కలిపితే దాదాపుగా 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ప్రోమో తోనే ఈ పాట ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే, పూర్తి పాట విడుదలయ్యాక కచ్చితంగా ‘గోదారి గట్టు’ పాట రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సెకండ్ హాఫ్ మొత్తం ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడట. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో వెంకీ కాంబినేషన్ సన్నివేశాలు ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అయ్యేలా చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. అదే కనుక నిజమైతే, ఈ సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి డామినేషన్ మామూలు రేంజ్ లో ఉండదు అనే చెప్పాలి. ఏకంగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రేంజ్ సునామీ ని క్రియేట్ చేస్తుంది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఇంకా పెరగొచ్చు కూడా. ఎందుకంటే అనిల్ రావిపూడి ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనే విషయం లో మన అందరికీ ఒక క్లారిటీ ఉంది కాబట్టి.
