Mana Shankara Vara Prasad Garu Day 1 Collection: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ‘భోళా శంకర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన చిత్రమిది. చాలా కాలం నుండి అభిమానులు మిస్ అవుతున్న వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని ఈ చిత్రం లో చూపించడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సోషల్ మీడియా మొత్తం నిన్న రచ్చ రచ్చ చేశారు. టాక్ కి తగ్గట్టుగానే, సోమవారం అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్ వచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 5 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది మామూలు విషయం కాదు.
పాన్ ఇండియన్ చిత్రాలకు కూడా బుక్ మై షో లో ఈమధ్య కాలం లో ఇంత రేంజ్ టిక్కెట్లు అమ్ముడుపోలేదు. పాజిటివ్ టాక్ కి ఉన్న పవర్ అలాంటిది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే మూవీ టీం ఈ చిత్రానికి 84 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ఇది కేవలం పబ్లిసిటీ మెటీరియల్ మాత్రమే. కానీ వాస్తవంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 70 నుండి 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇది సాధారణమైన విషయం కాదు. కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 9 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 4 కోట్ల 90 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 3 కోట్ల 80 లక్షలు, నెల్లూరు నుండి కోటి 65 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 10 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వసూళ్లు వచ్చాయి. అదే విధంగా పశ్చిమ గోదావరి నుండి 2 కోట్ల 50 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 3 కోట్ల 80 లక్క్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండి రిటర్న్ జీఎస్టీ తో కలిపి ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ నుండి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 78 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.