Dulquer Salmaan- Mammootty: ల్కర్ సల్మాన్ పరిచయం అక్కర్లేని పేరు. మమ్ముట్టి వారసుడిగా మలయాళం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ నటుడు మిగిలిన దక్షిణాది భాషల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడుగా ఎదిగాడు. ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ నటుడు, ఆ తర్వాత “మహానటి”చిత్రం ఫేమ్ రాబట్టారు. ఇటీవల ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన “సీతారామం” సినిమాతో తెలుగులో భారీ మార్కెట్ సొంతం చేసుకున్న పరభాషా నటుడిగా ఎదిగాడు.
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ నటుడు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. తన తండ్రి మమ్ముట్టి తనతో ఎంతో సరదాగా ఉంటాడని, కొడుకుగా కంటే ఒక ఫ్రెండ్ గా చూస్తాడని, ఇప్పటికి నాన్న ఏడాదికి నాలుగైదు సినిమాల్లో నటిస్తూ ఉంటారు. నేను మాత్రం ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నాను. ఈ విషయంలో నాన్న అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే మాత్రం ఇంటికి రానివ్వను అంటుంటారని చెప్పుకొచ్చాడు.
ఇక తన వైఫ్ అమల్ సూఫియా తనను ఇప్పటికి ఒక నటుడిగా చూడదని, కేవలం ఒక ఉద్యోగానికి వెళ్లి వచ్చిన వాడిగానే చూస్తుందని, అప్పుడప్పుడు తన ముందు నేను నటుడిని అని నిరూపించుకోవాల్సి వస్తుందని సరదాగా చెప్పుకొచ్చాడు ఈ హ్యాండ్సమ్ హీరో. ఇక స్టైలిష్ విషయంలో సౌత్ లో ఇండస్ట్రీలో అల్లు అర్జున్ తో పోటీ పడుతున్న ఈ హీరో ఎప్పటికప్పుడు తనదైన డ్రెస్సింగ్ స్టైల్ లో అదరకొడుతుంటాడు.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ “గన్స్ అండ్ గులాబ్స్” వెబ్ సిరీస్ మరియు “కింగ్ అఫ్ కోట” వంటి భారీ బడ్జెట్ గ్యాంగ్ స్టర్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. మరోపక్క తెలుగులో సీతారామం లాంటి క్లాసిక్ హిట్ అందించిన వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో తెలుగు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యంగ్ హీరో మరిన్ని అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యు హ్యాపీ బర్త్డే దుల్కర్ సల్మాన్.