https://oktelugu.com/

Golam Movie OTT : మలయాళ మర్డర్ మిస్టరీ గోళం సైలెంట్ గా ఓటీటీలోకి .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సమ్జద్ గోళం చిత్రం ద్వారా మలయాళ ఇండస్ట్రీ కి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే .. ఓ కార్పొరేట్ ఆఫీస్ లో ఉద్యోగులు రోజులాగే ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటారు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 11, 2024 / 06:25 PM IST

    Malayalam murder mystery Golam Movie goes silent in OTT

    Follow us on

    అద్భుతమైన చిత్రాలకు మలయాళ పరిశ్రమ పెట్టింది పేరు. తక్కువ బడ్జెట్ తో ఆద్యంతం ఆసక్తిరేపే చిత్రాలు చేస్తారు వారు. ఆ లిస్ట్ లోకి వస్తుంది గోళం మూవీ. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఇక సస్పెన్సు థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి పండగే అని చెప్పాలి.

    మిస్టరీ, సస్పెన్సు థ్రిల్లర్స్ కి ఓటీటీలో సూపర్ క్రేజ్ ఉంది. ఇలాంటి సినిమాలు, సిరీస్లు వీక్షించడానికి ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. ఓటీటీలో ఈ తరహా కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది. కారణం మెజారిటీ ఆడియన్స్ క్రైమ్ థ్రిల్లర్స్, హారర్, యాక్షన్ జోనర్స్ కోరుకుంటున్నారు. డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ పెరుగుతుంది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లోని ఆడియన్స్ మాత్రమే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో చిత్రాలు, సిరీస్లు చూసేవారు. ఇప్పుడు పల్లె జనాలు కూడా ఓటీటీకి అలవాటు పడ్డారు. అందుకే హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో సినిమా, జీ 5, సోనీ లివ్ వంటి బడా ఓటీటీ సంస్థలు ఇండియన్ మార్కెట్ కొల్లగొట్టేందుకు పోటీపడుతున్నాయి.

    ప్రతివారం లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రం పేరు ‘ గోళం ‘. జూన్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయింది. స్మాల్ బడ్జెట్ సినిమా అయినప్పటికీ మంచి విజయం సాధించింది. ప్రేక్షకులు గోళం చిత్రాన్ని థియేటర్స్ లో ఆదరించారు.

    గోళం మూవీ వసూళ్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి. కేవలం రూ. 5 కోట్లు బడ్జెట్ తో తీసిన సినిమా రూ. 10 కోట్లు వసూలు చేసింది. మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ‘ గోళం ‘ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. గోళం మూవీ అందరూ కొత్త నటులతో తెరకెక్కింది. దర్శకుడు సైతం కొత్తవాడే. స్టార్ క్యాస్ట్ లేని గోళం సూపర్ హిట్ కావడం విశేషం. రంజిత్ సాజీవ్ హీరోగా నటించాడు. సన్నీవేన్, సిద్దిఖీ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. సమ్జద్

    సమ్జద్ గోళం చిత్రం ద్వారా మలయాళ ఇండస్ట్రీ కి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే .. ఓ కార్పొరేట్ ఆఫీస్ లో ఉద్యోగులు రోజులాగే ఎవరి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. అందరూ చూస్తుండగానే జాన్ అనే వ్యక్తి హత్యకు గురవుతాడు. పొలిటికల్ గా జాన్ పలుకుబడి ఉన్న వ్యక్తి. దీంతో ఆ మర్డర్ పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కొత్తగా ఉద్యోగంలో చేరిన సందీప్ కృష్ణ రంగంలోకి దిగుతాడు.

    ఆ ఆఫీసులో పని చేసే ఉద్యోగుల్లోనే ఎవరో ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తాడు. అతను ఈ మర్డర్ మిస్టరీ ఎలా చేధించాడు? ఈ కేసు ఎలా సాల్వ్ చేశాడు? జాన్ ను హత్య చేసిన కిల్లర్ ని సందీప్ పట్టుకున్నాడా? చివరికి ఏమైంది? అనేది మిగిలిన స్టోరీ. ఈ ఏడాది మలయాళ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగిపోయింది. చిన్న, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా మంచి విజయాలు సాధిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ‘ గోళం ‘ సినిమా ఓటీటీలో మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంది.