Director Siddique Passed Away: దర్శకుడు సిద్దిఖీ అకాల మరణం పొందారు. గుండెపోటుకు గురైన సిద్దిఖీని కొచ్చి నగరంలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మరణించారు. సిద్దిఖీ లివర్ సంబంధిత సమస్యలు ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. అలాగే ఆయనకు నిమోనియా సోకిందట. పరిస్థితి విషమించడంతో ఎక్మో ట్రై చేశారు. అయినా సిద్ధిఖీ శరీరం సహకరించలేదు. సిద్ధిఖీ వయసు 63 ఏళ్ళు. 1986లో పరిశ్రమలో అడుగుపెట్టిన సిద్ధిఖీ 1989లో రామ్ జీ రావ్ స్పీకింగ్ మూవీతో దర్శకుడు అయ్యాడు.
ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా నటించారు. మోహన్ లాల్ తో సిద్ధిఖీ గట్టి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో కొన్ని సినిమాలు తెరకెక్కాయి. సిద్ధిఖీ చివరి చిత్రం బిగ్ బ్రదర్ కాగా… ఈ చిత్ర దర్శకుడు సిద్ధిఖీనే. దర్శకుడిగా సిద్ధిఖీ మొదటి చిత్రం చివరి చిత్రంలో మోహన్ లాల్ నటించడం యాదృచ్ఛికం.
సిద్ధిఖీ కెరీర్లో అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు. చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ కథ ఆయనదే. మలయాళంలో మోహన్ లాల్ చేసిన చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హిట్లర్ టైటిల్ తో చేశారు. సిద్ధిఖీ తెరకెక్కించిన మరో సూపర్ హిట్ మూవీ బాడీ గార్డ్. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగులో వెంకటేష్, హిందీలో సల్మాన్ ఖాన్ నటించారు.
సిద్ధిఖీ మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్, మోహన్ లాల్ తో పాటు మలయాళ పరిశ్రమకు చెందిన పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. అభిమానులు ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు. తెలుగులో సిద్ధిఖీ మారో టైటిల్ తో ఒక మూవీ చేశారు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆడలేదు. దాంతో మరలా ఆయన తెలుగులో మూవీ చేయలేదు.
— Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2023
RIP Deepest condolences to the family 🙏 pic.twitter.com/LXjkvvxxBl
— Prabhudheva (@PDdancing) August 8, 2023