spot_img
Homeఎంటర్టైన్మెంట్Heroine: అకౌంటెంట్ ని గుడిలో పెళ్లి చేసుకున్న ఆ సంచలన చిత్రం హీరోయిన్!

Heroine: అకౌంటెంట్ ని గుడిలో పెళ్లి చేసుకున్న ఆ సంచలన చిత్రం హీరోయిన్!

Heroine: యంగ్ హీరోయిన్ గుడిలో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంది. ఆమె వివాహానికి సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ న్యూస్ వైరల్ గా మారింది. సదరు హీరోయిన్ ఎవరో కాదు మీరా నందన్. కేరళకు చెందిన మీరా నందన్ 2008లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించింది. మీరా నందన్ మొదటి తెలుగు చిత్రం జై బోలో తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో ఈ చిత్రం తెరకెక్కింది.

అప్పట్లో జై బోలో తెలంగాణ మూవీ ఒక సంచలనం. కారణం మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం కూడా నడుస్తుంది. జగపతిబాబు ఈ చిత్ర హీరోగా చేయడాన్ని కూడా కొందరు తప్పుబట్టారు. ఆఫర్స్ లేని జగపతిబాబు కేవలం డబ్బు కోసం జై బోలో తెలంగాణ చిత్రం చేసినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు. జై బోలో తెలంగాణ తర్వాత హితుడు టైటిల్ తో మరో తెలుగు చిత్రం చేసింది. ఈ మూవీలో కూడా జగపతి బాబు ప్రధాన పాత్ర చేశాడు.

2017 తర్వాత మీరా నందన్ లాగ్ గ్యాప్ తీసుకుంది. ఐదేళ్ల తర్వాత 2023లో ఓ మలయాళ చిత్రం చేసింది. 33 ఏళ్ల మీరా నందన్ తాజాగా పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. ఆమె పెళ్లి ఎర్నాకుళం లో గల ఓ గుడిలో నిడారంబరంగా జరిగింది. మీరా నందన్ భర్త పేరు శ్రీజు. ఆయన లండన్ లోని గురువాయూర్ టెంపుల్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు.

శ్రీజ-మీరా నందన్ ఓ మాట్రిమోని యాప్ ద్వారా కలిసినట్లు సమాచారం. అలా మొదలైన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దగా ఆర్భాటం లేకుండా వీరి వివాహం జరిగింది. మీరా నందన్ పెళ్లి వార్త తెలిసిన సన్నిహితులు, మిత్రులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Meera Nandhaa (@nandan_meera)

RELATED ARTICLES

Most Popular