https://oktelugu.com/

Tollywood: ప్చ్.. తెలుగు సినిమా పై ఇంత చుల‌క‌న భావమా ?

Tollywood: అతను మ‌ల‌యాళ న‌టుడు, మంచి నటుడు కూడా. అయితే, రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్ గా చెప్పాలంటే.. అతను పాత్ర సినిమా చివర్లో వస్తోంది. సెకెండ్ పార్ట్ లో అతను ఇంకా కీలకంగా నటించనున్నాడు. కాబట్టి.. ఫస్ట్ పార్ట్ లో అతని నటన గురించి ఎవరూ ఎక్కువ ప్రస్తావించలేదు. కానీ, తాజాగా ఆ నటుడు ఆ సినిమా దర్శకుడు.. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 23, 2021 / 07:10 PM IST
    Follow us on

    Tollywood: అతను మ‌ల‌యాళ న‌టుడు, మంచి నటుడు కూడా. అయితే, రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ముసుగులో గుద్దులాట లేకుండా డైరెక్ట్ గా చెప్పాలంటే.. అతను పాత్ర సినిమా చివర్లో వస్తోంది. సెకెండ్ పార్ట్ లో అతను ఇంకా కీలకంగా నటించనున్నాడు. కాబట్టి.. ఫస్ట్ పార్ట్ లో అతని నటన గురించి ఎవరూ ఎక్కువ ప్రస్తావించలేదు.

    Malayalam actor

    కానీ, తాజాగా ఆ నటుడు ఆ సినిమా దర్శకుడు.. దర్శకుడు అనే కంటే క్రియేటివ్ డైరెక్టర్ అని అనడం మంచిది. ఎందుకంటే.. అతనికి క్రియేటివ్ డైరెక్టర్ అని పిలిపించుకోవడం మహా సరదా. అయితే, ఆ దర్శకుడికి మన పులుసు కంటే పొరుగింటి పుల్ల‌కూర రుచి ఎక్కువ అని నమ్మకం. అందుకే, బ‌య‌టివాళ్ల‌ను ఎక్కువగా ప‌ర‌భాషా న‌టుల్ని తీసుకొచ్చి తన సినిమాల్లో పెట్టుకోవాలని బాగా సరదా పడుతుంటాడు.

    ఈ క్రమంలోనే ఆ మ‌ల‌యాళ న‌టుడ్ని తీసుకువచ్చి మొత్తానికి తన సినిమాలో పెట్టుకున్నాడు. కాదు, నెత్తిన పెట్టుకున్నాడు. పాలాభిషేకాలు ఒక్కటే లేవు, ఇక అడిగినంత పారితోషికాలు ఇప్పించాడు. పైగా అధిక గౌర‌వం ఇచ్చాడు. అయినా ఇది టాలీవుడ్ కి ఎప్పటి నుంచో వస్తోన్న ఆనవాయితీ. మన వాళ్లకు వంద రూపాయిలు ఇవ్వరు గానీ, పక్క బాష వాళ్లకు లక్ష ఇస్తాం అంటారు.

    సరే.. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే.. ఆ మ‌ల‌యాళ న‌టుడు తన కెరీర్‌లోనే అత్య‌ధిక పారితోషికం అందుకుని.. చివరకు తెలుగు సినిమా పై చుల‌క‌న భావం వ్యక్తం చేశాడు. అసలు తెలుగు దర్శకులకు నిర్మాతలకు సినిమా అంటేనే తెలీదు అని, వాళ్లకు మేకింగ్ పై పట్టు లేదు అని, డ‌బ్బులను టిష్యూ పేప‌ర్ల‌లా ఖర్చు చేస్తారని ఇలా చాలా నెగిటీవ్ కామెంట్లు చేశాడ‌ట‌.

    Also Read: Aha: ‘ఆహా’ కోసం వంశీ పైడిపల్లి, సుక్కు వెబ్ సిరీస్ లు !

    ఇక మన క్రియేటివ్ డైరెక్టర్ గారి గురించి అయితే చాలా గొప్పగా చెప్పాడట. అస‌లు విజ‌న్‌, క్లారిటీ లేని డైరెక్టర్ సినిమా చేశాను, అతన్ని చూస్తే ఫన్నీగా అనిపించింది, అతనికి అసలు కనీస జ్ఞానం కూడా లేదు’ అని త‌న‌కు తెలిసిన మలయాళ ఫిల్మ్ మేకర్స్ ద‌గ్గ‌ర‌, అలాగే పరిచయం ఉన్న తమిళ ఫిల్మ్ మేకర్స్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించాడు. వాళ్ళ ద్వారా ఈ నెగిటీవ్ కామెంట్లు బయటకు వచ్చాయి. తప్పు లేదులే, ఆ క్రియేటివ్ డైరెక్టర్ కి ఇలాగే జరగాలి.

    Also Read: Nani: నాని వ్యాఖ్యల వల్ల స్టార్ హీరోలకే ఇబ్బంది !

    Tags