Homeఎంటర్టైన్మెంట్Malavika Mohanan: దేవకన్యలా మాళవిక.. బంగారు వర్ణంలో జిగేల్ మంటున్న మల్లు సుందరి

Malavika Mohanan: దేవకన్యలా మాళవిక.. బంగారు వర్ణంలో జిగేల్ మంటున్న మల్లు సుందరి

Malavika Mohanan: నేరుగా ఇంతవరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. నటించిన సినిమాల్లో మాస్టర్ తప్ప.. మిగతావన్నీ పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మలయాళ సుందరి మాలవికా మలయాళ సుందరి మాళవిక మోహనన్(malavika Mohanan) కు తెలుగులో అభిమానులు ఎక్కువ. సామాజిక మాధ్యమాలలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ప్రస్తుతం ఆమె విక్రం హీరోగా తమిళంలో రూపొందుతున్న తంగలం అనే సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో నిర్మాణంలో ఉన్న రాజా సాబ్ సినిమాలోనూ మాళవిక నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక తనకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

సినిమాల్లోకి రాకముందు మాళవిక ఒక మోడల్. ఎన్నో ప్రసిద్ధమైన కంపెనీలకు ఆమె ప్రచారకర్తగా పనిచేసింది. కేరళ తన జన్మస్థలమైనప్పటికీ.. ఆమె ముంబైలో జన్మించింది. డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగం వైపు మళ్ళింది. తన తండ్రి మలయాళ సినిమా పరిశ్రమకు చెందినవాడు కావడంతో సహజంగానే మాళవిక మోడల్ రంగం నుంచి సినిమా వైపు వచ్చింది. తన మాతృభాష అయిన మలయాళం లో 2013లో పట్టం పోల్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 2015లో నిర్ణయకం అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. 2016లో నాన్ మట్టు వరలక్ష్మి అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2017 లో ది గ్రేట్ ఫాదర్ అనే మలయాళ సినిమాలో నటించింది. 2019లో రజనీకాంత్ హీరోగా నటించిన పేట అనే తమిళ చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 2021లో విజయ్ హీరోగా రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. బియాండ్ ద క్లౌడ్స్ అనే హిందీ సినిమాలోనూ మెరిసింది. అయితే ఇవేవీ ఆమె కెరియర్ కు పెద్దగా హెల్ప్ కాలేదు..

2013 నుంచి కథానాయకగా కనిపిస్తున్నప్పటికీ.. మాస్టర్ మినహా మిగతావేవీ ఆమెకు పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా రూపొందుతున్న తంగళం, ప్రభాస్ హీరోగా నిర్మాణంలో ఉన్న రాజా సాబ్ చిత్రాల్లో మాళవిక నటిస్తోంది. వీటిపైనే ఆమె గంపెడు ఆశలు పెట్టుకుంది. సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఫోటోషూట్ లో మెరుస్తూ ఉంటుంది. తాజాగా మాళవిక ఫోటోషూట్ నిర్వహించింది. బంగారు వర్ణంలో మెరిసిపోయే దుస్తుల్లో మాళవిక కనిపించింది. ఐదు అడుగుల కు మించిన ఎత్తు, దానికి తగ్గట్టుగా శరీర సౌష్టవంతో మాళవిక అధునాతన దుస్తులు ధరించి హొయలు పోయింది. ఆ ఫోటోలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. మరి ఈ ఫోటోలు దర్శక, నిర్మాతలను మెప్పిస్తాయా? ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయా? చూడాలి మరి ఏం జరుగుతుందో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular