GhaniFirstPunch: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కాగా ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఫస్ట్ పంచ్ రాబోతుంది. షార్ట్ గ్లింప్స్ అనే పేరుతో చిన్నపాటి టీజర్ ను వదల బోతున్నారు. టీజర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ ను రివీల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ మధ్య వదిలిన ఓ పోస్టర్ లో కూడా వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపించాడు.

బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.
అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో ‘బాలు’ అనే సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే. ఇప్పుడు వరుణ్ తేజ్, పవన్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం. వరుణ్ తేజ్ కి పవన్ పేర్లను వాడుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తోనే ఒక సినిమా చేసి వరుణ్ తేజ్ హిట్ కూడా కొట్టాడు.
మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి. కాగా ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇక కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాల పై వస్తోన్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కరోనా కారణంగా వెనుకబడింది.