Nithya Menen: నిత్య మీనన్ మంచి నటి.. కేరళ కుట్టి అయినా, మాతృభాష మలయాళం అయినా తెలుగు నేర్చుకుంది. తన పాత్రలకు తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం అలవాటు చేసుకుంది. పైగా ఒక తెలుగమ్మాయిలా ఆమె తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. కానీ ఈ సారి నిత్య మీనన్ ఒక్క తెలుగులో మాట్లాడటమే కాదు, యాసలో మాట్లాడింది. తెలుగు బాగా వచ్చిన వాళ్ళు కూడా తెలంగాణ యాసలో మాట్లాడలేరు.

యాసకు ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. పైగా యాసలో డైలాగులు చెప్పడం అంటే.. భాష పై ఎంతో కమాండ్ ఉండాలి. పరాయి భాష అమ్మాయి, మరో భాష పై నెల రోజుల్లో అది బలమైన పదాలు ఉన్న యాస పై పట్టు సాధించడం అంటే.. అంత సులువు కాదు. కానీ, నిత్య సాధించింది. అందుకే ఆమె టాలెంట్ కి సినిమా మేకర్స్ ఫిదా అయిపోతున్నారు.
ఇంతకీ నిత్య చేసిన ఏ సినిమా గురించి ఇదంతా అంటే.. త్వరలో విడుదల కానున్న ‘స్కైలాబ్’ సినిమా గురించే. ఈ సినిమాలో నిత్య తెలంగాణ యాసలో డైలాగులు పలికింది. సత్యదేవ్ హీరోగా, నిత్య మీనన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 4న రిలీజ్ కాబోతుంది. పైగా ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. ఈ సినిమాకి నిత్య మీనన్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.
Also Read: భీమ్లానాయక్ మాస్ టీజర్ రిలీజ్ అప్పుడేనా?
ఈ సినిమా కథ కూడా ఆసక్తిగా ఉంటుందట. తెలంగాణలోని బండలింగం పల్లి అనే ఓ చిన్న గ్రామంలో జరిగే కథ ఇది. పైగా ఈ సినిమా పీరియడ్ నేపథ్యంలో సాగుతుంది. అయితే సినిమా ఎంత పీరియాడిక్ మూవీ అయినా, సినిమాలో కంటెంట్ మాత్రం ట్రెండీగా ఉంటుందని, సినిమా మొత్తం కలర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక నిత్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను తెలంగాణ యాసలో మాట్లాడే సమయంలో చాలా నేర్చుకున్నాను. అయితే, యాస అనేది భాష అందాన్ని పెంచుతుంది. అందుకే, యాస ఇష్టపడి నేర్చుకున్నాను. అందుకే, సింక్ సౌండ్ లో డైలాగ్ లు చెప్పాను. అందరి ముందు సెట్ లోనే డైలాగులు చెప్పడం, అదీ తెలియని భాషలో అంటే కాస్త ఇబ్బందే. కానీ ఇష్టంగా చేశాను’ అని చెప్పుకొచ్చింది నిత్య మీనన్. ఎంత టాలెంట్ ఉన్నా నిత్య మీనన్ మాత్రం స్టార్ కాలేకపోయింది.
Also Read: త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ అదిరిపోయింది..!