https://oktelugu.com/

Major Movie: అడవి శేష్ “మేజర్” సినిమా విడుదల తేదీ ఖరారు…

Major Movie: విభిన్న కధాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో వరుస హిట్ లు అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ లలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నా ఈ హీరో ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్న సినిమా “మేజర్”. వెరైటీ కథలను ఎంచుకుని ఓరేంజ్ హీరోగా ఎదిగారు అడవి శేషు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 12:02 PM IST
    Follow us on

    Major Movie: విభిన్న కధాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో వరుస హిట్ లు అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ లలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నా ఈ హీరో ఇప్పుడు ప్రస్తుతం నటిస్తున్న సినిమా “మేజర్”. వెరైటీ కథలను ఎంచుకుని ఓరేంజ్ హీరోగా ఎదిగారు అడవి శేషు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.

    కాగా ఈ మేరకు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన “మేజర్” సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా  తెరకెక్కిస్తున్నారు.  26/11 టెర్రరిస్ట్ ల  దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉన్ని కృష్ణన్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ నటుడు మురళి శర్మ ఇందులో ఓ కీలకపాత్ర చేస్తున్నారు.

    ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీఎంబి ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది మూవీ టీం.