Mahesh Babu Son Gautam: స్టార్స్ వారసులు హీరోలు కావడం ఆనవాయితీ. ఇది నేపోటిజం అని కొందరు విమర్శలు చేసినా ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు. మరి ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ పిల్లలు కూడా పెద్దవాళ్ళై పోయారు. మహేష్, పవన్ కళ్యాణ్, వెంకటేష్ వంటి హీరోల కుమారులు టీనేజ్ కి వచ్చేశారు. దీంతో వాళ్ళ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఘట్టమనేని అభిమానులు గౌతమ్ రాకపై ఆసక్తిగా ఉన్నారు.
గౌతమ్ తండ్రి మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సంచలనాలు చేశారు. స్టార్డం అనుభవించిన వన్ అండ్ ఓన్లీ చైల్డ్ ఆర్టిస్ట్ మహేష్ అని చెప్పొచ్చు. మహేష్ బాల్యంలోనే తండ్రి, అన్నయ్యలతో మల్టీస్టారర్స్ చేశాడు. డ్యూయల్ రోల్ చేశాడు. హీరోలకు సమాంతరమైన పాత్రలు చేశాడు. మహేష్ తో పోల్చుకుంటే గౌతమ్ వెనుకబడ్డట్టే లెక్క. అయితే గౌతమ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే మూవీలో గౌతమ్ మహేష్ చిన్నప్పటి పాత్ర చేశాడు.
గౌతమ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడనే సందిగ్ధత కొనసాగుతుండగా… మహేష్ వైఫ్ నమ్రత క్లారిటీ ఇచ్చారు. పీఎంజే జ్యూవెలర్స్ కి మహేష్ కూతురు సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా నమ్రత, సితార పాల్గొన్నారు. నమ్రత స్పందిస్తూ…గౌతమ్ హీరో కావడానికి ఇంకా సమయం ఉంది. గౌతమ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంది. గౌతమ్ హీరో అవుతాడు. అయితే 6-8 ఏళ్ల సమయం పడుతుందని అన్నారు.
దీంతో మహేష్ వారసుడు గౌతమ్ హీరో అయ్యేందుకు చాలా ఏళ్ళు పడుతుందని తేలిపోయింది. ఇది కొంచెం నిరాశపరిచే అంశమే. అయితే గౌతమ్ హీరో అవుతాడని, ఆసక్తి ఉందని నమ్రత పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది. ఆ విషయంలో సంబరాలు చేసుకుంటున్నారు. కాగా సితారతో పోల్చితే గౌతమ్ సున్నితం. చాలా సిగ్గరి. సితార మాత్రం దూసుకుపోతుంది. అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది. ఇక తన మొదటి రెమ్యూనరేషన్ చారిటీకి ఇచ్చినట్లు సితార వెల్లడించారు.