Mahesh Murari Movie Actress: టాలీవుడ్ హీరో మహేష్ బాబు సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈమె ఏకంగా 2500 పైగా సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకు. ఎన్నో అవార్డులను కూడా ఈ హీరోయిన్స్ అంతం చేసుకుంది. కానీ చివరకు ఎవరు ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఒకప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అప్పట్లో అందరూ స్టార్ హీరోల సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా సుమారు 2500 కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకొని ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈమె పదేళ్ల అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. కానీ చివరకు ఒక అగ్ని ప్రమాదంలో ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకున్న దిగ్గజ నటి సుకుమారి. సుకుమారి అమ్మ అని కూడా ఈమెను అభిమానులు పిలుచుకునేవారు. ఐదు దశాబ్దాల నుంచి సుకుమారి సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉండేది. 1940లో ఈమె నాగర్ కోయిల్ లో పుట్టింది.
Also Read: Tollywood Heroine : అందాలతో కవ్విస్తున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. చూస్తే మతి పోవాల్సిందే..
ఈమె తల్లిదండ్రులు మలయాళీ కుటుంబానికి చెందినవారు. తనకు ఏడేళ్ల వయసులో సుకుమారి శాస్త్రీయ నృత్యంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. శాస్త్రీయ నృత్యంలో అప్పట్లో ఆమె అమెరికా, భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో అనేక ప్రదర్శనలలో కూడా పాల్గొంది. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి 1951లో తనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓరూరాటు అనే సినిమాతో పరిచయం అయింది. అన్ని భాషలలో కలిపి దాదాపు 2500 పైగా సినిమాలలో నటించి బాగా క్రేజ్ తెచ్చుకుంది. తన సహజమైన నటనతో హాస్యం, భావద్వేగా, విలన్ పాత్రలకు కూడా సుకుమారి ప్రాణం పోసింది. తన దశాబ్దాల సినిమా కెరియర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ఆమెకు 2003లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

అలాగే తమిళ సినిమా నమ్మ గ్రామం సినిమాతో సుకుమారికి 2010లో జాతీయ చలనచిత్ర అవార్డు కూడా వచ్చింది. కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ ను నాలుగు సార్లు గెలుచుకుంది. సుకుమారి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మురారి సినిమాలో బామ్మ పాత్రలో నటించింది. బుల్లితెరపై కూడా సుకుమారి పలు సీరియల్స్ లో, వాణిజ్య యాడ్స్ లో, రంగస్థలం ప్రదర్శనలలో పాల్గొంది. సుకుమారి 2013 ఫిబ్రవరిలో తన ఇంట్లో దీపం వెలిగిస్తున్న సమయంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడటం జరిగింది. వెంటనే ఆమెకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో 2013 మార్చి 26న సుకుమారి కన్నుమూసింది.