https://oktelugu.com/

‘మహేష్ – కమల్’ భారీ మల్టీస్టారర్‌.. నిజమెంత ?

సినిమా ఇండస్ట్రీలోని గాసిప్స్‌ భలే విచిత్రంగా ఉంటాయి. సాధ్యం కానీ, క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా రాబోతుంది అంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. ఈ క్రమంలో ఓ అదిరిపోయే కలయికను కలిపేశారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కలిసి స్క్రీన్‌ పంచుకోనున్నారని.. వీరిద్దర్నీ కలిపి ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ చేయడానికి సన్నద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం మురుగదాస్‌ ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నారని తాజాగా […]

Written By:
  • admin
  • , Updated On : June 6, 2021 / 04:00 PM IST
    Follow us on

    సినిమా ఇండస్ట్రీలోని గాసిప్స్‌ భలే విచిత్రంగా ఉంటాయి. సాధ్యం కానీ, క్రేజీ కాంబినేషన్స్ లో సినిమా రాబోతుంది అంటూ పుకార్లు పుట్టిస్తుంటారు. ఈ క్రమంలో ఓ అదిరిపోయే కలయికను కలిపేశారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కలిసి స్క్రీన్‌ పంచుకోనున్నారని.. వీరిద్దర్నీ కలిపి ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ చేయడానికి సన్నద్ధం చేస్తున్నాడట.

    ప్రస్తుతం మురుగదాస్‌ ఈ ప్రాజెక్ట్‌ కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నారని తాజాగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఈ పుకారు నిజమైతే ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమాకి భారీ క్రేజ్ ఉంటుంది. కమల్ హాసన్ అంటే తనకు ఎంతో అభిమానం అని ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పుకొచ్చాడు.

    అలాగే మహేష్ నిజమైన సూపర్ స్టార్ అంటూ.. ఈ జనరేషన్ లో మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టం అని కమల్ కూడా ఓ సందర్భంలో సభాముఖంగా తెలియజేసాడు. మరి, ఇప్పుడు ఈ రేర్ కాంబినేషన్ లో సినిమా వస్తే.. కచ్చితంగా ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక ఈ న్యూస్ లో వాస్తవం ఎంత ఉందో క్లారిటీ లేదు గాని, మహేష్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు.

    మురుగదాస్ అంటేనే మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌, ఇలాంటి డైరెక్టర్ డైరెక్షన్ లో కమల్ – మహేష్ కలిసి నటిస్తే చూడాలని సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వారి ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి. కానీ, ప్రస్తుతం మురుగదాస్ ఫామ్ లో లేడు. అలాగే కథల పరంగా కూడా గతంలో ఉన్నంత షార్ప్ గా ఉండటం లేదు. మరి చూడాలి మురుగదాస్ ఎంతవరకు ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకువెళ్తాడో. అయితే ఇప్పటివరకూ ఈ పుకారులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.