Mahesh babu: వరుస చిత్రాలతో దూకుడు మీదున్న మహేష్ బాబు తాజాగా మరో చిత్రాన్ని లైన్లో పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ‘సర్కారి వారి పాట’ చేస్తున్న మహేష్.. ఇది పూర్తికాగానే త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత రాజమౌళితో ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీని తీయబోతున్నాడు.

ఈ మూడు చిత్రాలు ఇంకా పూర్తికాకముందే మహేష్ బాబు మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు తెలిసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మరో సినిమా తెరకెక్కించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అనిల్ రావిపూడి కథకు మహేష్ ఓకే చెప్పాడని సమాచారం. రాజమౌళి మూవీ తర్వాతే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారి ప్రకటన వెలువడాల్సి ఉంది.
గతంలోనే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ కోసం అనిల్ మరో కథ రాశాడని.. కానీ దాన్ని కొద్ది మార్పులు చేయమని మహేష్ సూచించాడని.. మంచి కథ సిద్ధం కావడంతో ఇప్పుడు చేయడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది.
ప్రస్తుతం ‘సర్కారివారి పాట’ మూవీ షూటింగ్ నవంబర్ లో పూర్తికానుంది. దీన్ని సంక్రాంతికి విడుదల చేస్తారు. అనంతరం త్రివిక్రమ్ మూవీని సమ్మర్ లోపు పూర్తి చేసి రాజమౌళి సినిమాకు మహేష్ వెళ్లిపోనున్నారు. ఆ తర్వాతే అనిల్ రావిపూడి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపు 2023 తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఆలోపు అనిల్ రావిపూడి ఇతర హీరోలతో సినిమాలు చేయనున్నాడు.