Mahesh Babu: హీరో అజిత్ లేటెస్ట్ మూవీ ‘వలిమై’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. తాజాగా ట్రైలర్ ను హీరో మహేష్ బాబు రిలీజ్ చేశారు. తెలుగు హీరో కార్తీకేయ ఈ సినిమాలో ఓ కీలకపాత్రను పోషించగా.. ఈ నెల 24న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

మహేష్ గతంలో కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు ఇలాగే సపోర్ట్ చేశాడు. మహేష్ ది లక్కీ హ్యాండ్ అని పేరు ఉంది. అందుకే… స్టార్ హీరోలు కూడా తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను మహేష్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మహేష్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.
Also Read: మంచు ఫ్యామిలీకి ఆహ్వానం ఎందుకు అందలేదు ?
అతడు సినిమాలోని హీరో రోల్ ‘పార్థు’ను ఈ సినిమా టైటిల్‌గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మహేశ్‌బాబు కొత్త మూవీ టైటిల్ ‘పార్థు’ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేయబోతుంది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి మహేష్ సిస్టర్ గా నటించబోతుందట. డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పటి నుంచే త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచుతున్నారు.

సినిమాలో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అంటూ డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని, అలాగే పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యాన్ని కూడా చూపిస్తారట. హారికా హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
Also Read: రవితేజ ఖిలాడి ఎలా ఉంది..? ట్విట్టర్ రివ్యూ
[…] […]
[…] FIR Movie Review: విష్ణు విశాల్ హీరోగా వచ్చిన మరో మూవీ ‘ఎఫ్ఐఆర్’. ఇప్పటికే ‘రాక్షసుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ యంగ్ హీరోకు ఒక్క సినిమాతోనే సినీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. తాజాగా ఆయన నటించిన ‘ఎఫ్ఐఆర్’మూవీని ప్రముఖ నటుడు రవితేజ మెచ్చుకోవడం చూస్తే విష్ణు విశాల్ పర్పామెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే శుక్రవారం విడుదలయిన ‘ఎఫ్ఐఆర్’ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.. […]