Mahesh Gets Tears: ఎప్పుడూ భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని మాట్లాడే మహేష్ బాబు తొలిసారి తన కొత్త సినిమా ‘సర్కారివారిపాట’ ప్రీరిలీజ్ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అసలు మహేష్ ఎందుకు ఏడ్చాడు? అసలు కారణాలేంటన్న దానిపై ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్న పరిస్థితి నెలకొంది.

ఎప్పుడూ కూల్, శాంతంగా, ఆనందంగా ఉండే మహేష్ బాబు ఒక్కసారిగా ఎమోషన్ ను అదుపులో పెట్టుకోక కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. దానికి కారణం ‘కోవిడ్’. అవును అది మహేష్ ను బాధపెట్టింది. ఓ రెండేళ్లు ఇలా ఎవరినీ కలవకుండా దూరంగా గడపడం చాలా కష్టమైందని ఆయన ఆవేదన చెందారు.
Also Read: Krithi Shetty: ప్చ్.. తత్త్వం బోధపడింది.. మళ్లీ ప్రాకులాడుతుంది
కోవిడ్ సమయం చాలా కష్టంగా గడిచిందని.. నాకు దగ్గరైన వారు ఎందరో దూరమయ్యారని తన అన్నయ్య రమేశ్ బాబు మరణం.. తన పీఆర్వో బీఏ రాజు మరణాన్ని తలుచుకొని మహేష్ బాబు ఒక్కసారిగా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఇక ఫ్యాన్స్ మాత్రం నాకు దగ్గరయ్యారని.. మీ అభిమానం మాత్రం చెక్కుచెదరలేదని.. మీ అందరి సపోర్టుతో ముందుకు వెళుతున్నానని ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పెట్టుకుంటూ మహేష్ బాబు ఏడ్చేశాడు.

ఇక తమన్ తో గ్యాప్ గురించి మహేష్ బాబు సర్కారి వారి పాట వేడుకలో వివరించారు. తమన్ కు నాకు మధ్య గ్యాప్ వచ్చిందని.. కానీ ఎందుకు వచ్చిందో తెలియదు అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ టైంలోని ఫైట్ ను పరోక్షంగా ప్రస్తావించారు మహేష్. ఆ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం చేయడం.. అదే సమయంలో ‘అల వైకుంఠపురంలో’ పోటీగా రిలీజ్ థమన్ మ్యూజిక్ తో బంపర్ హిట్ కొట్టడంతో వీరి మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుగు థమన్ మ్యూజిక్ సంచలనం అని.. నా సినిమాకు ఇరగదీసేలా మ్యూజిక్, బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని మహేష్ బాబు వేదిక మీదే థ్యాంక్స్ చెప్పాడు.
ఒక్కడు మూవీ సినిమా చూసి బండెక్కి హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ అయిన దర్శకుడు పరుశురాం ఇప్పుడు మహేష్ నే డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడని.. ఈ విషయాన్ని దర్శకుడు పరుశురాం కథ చెప్పి ఇంటికెళ్లాక మెసేజ్ పెట్టాడని మహేష్ బయటపెట్టాడు. నాన్న గారు, నా ఫ్యాన్స్ కు మీరే నా ఫేవరెట్ డైరెక్టర్ అంటూ సర్కారివారి పాట ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ వేదికమీదనే మహేష్ బాబు తన డైరెక్టర్ పరుశురాంకు కృతజ్ఞతలు తెలిపాడు.
మొత్తంగా రెండున్నరేళ్లుగా కరోనాతో సినిమాలకు దూరంగా ఉండి ఆప్తులను కోల్పోయిన మహేష్ బాబు ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత అభిమానులను చూసి తట్టుకోలేకపోయాడు. అందరి ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Also Read:South Stars- Side Business: ఆ పని చేసి కోట్లు సంపాదిస్తున్న సౌత్ స్టార్స్ వీళ్ళే !