Mahesh Babu: నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘనంగా జరిగాయో మనమంతా చూసాము. నిన్న ఆయన హీరో గా నటించిన చిత్రాలలో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘మురారి’ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యగా, దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. స్త్రీలు కూడా థియేటర్స్ లో ఈలలు వేసి హంగామా చెయ్యడం వంటివి మనం చూసాము. కొన్ని చోట్ల అయితే ప్రేమ జంటలు థియేటర్స్ లోనే పెళ్లి చేసుకోగా, అభిమానులు అక్షింతలు చల్లి ఆశీర్వదించిన ఘటనలు కూడా జరిగాయి. ఇలా మహేష్ అభిమానులు నిన్న ఈ సినిమా రీ రిలీజ్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసారు.
అయితే ఏ హీరో పుట్టినరోజు వచ్చినా, ఆ హీరోకి సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వడం ఇండస్ట్రీ లో ఒక ఆనవాయితిగా వస్తూ ఉంది. కానీ నిన్న మహేష్ పుట్టినరోజు కి ఎలాంటి అప్డేట్ రాకపోవడం అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురి చేసిన విషయం. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తో చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాబోదని మహేష్ అభిమానులకు ముందే సంకేతాలు వచ్చాయి. కానీ డైరెక్టర్ రాజమౌళి నుండి మహేష్ బాబు కి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా రాకపోవడం అభిమానులను తీవ్రమైన అసహనం కి గురయ్యేలా చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా ప్రతీ స్టార్ హీరో పుట్టినరోజుకి ప్రత్యేకించి శుభాకాంక్షలు తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసే రాజమౌళి మహేష్ బాబు ని ఎందుకు నిర్లక్ష్యం చేసినట్టు?, అసలు వీళ్ళ మధ్య అంతా సఖ్యంగానే ఉందా?, అసలు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు అభిమానుల్లో ఇప్పుడు మొదలయ్యాయి. సంవత్సరం క్రితమే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టాడు.
ఈమధ్యనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని ఫిలిం నగర్ లో ఒక టాక్ కూడా వినిపించింది. హైదరాబాద్ లోనే అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రతీ రోజు మహేష్ బాబు వర్క్ షాప్ లో పాల్గొంటున్నాడని, ఈ సినిమాకి డైలాగ్ డెలివరీ కాస్త కొత్తగా ఉండాలి కాబట్టి ప్రముఖ సీనియర్ నటుడు నాజర్ పర్యవేక్షణలో మహేష్ బాబు శిక్షణ కూడా తీసుకుంటున్నాడు అని టాక్ వినిపించింది. ఇంత ప్రోగ్రెస్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ సినిమా గురించి అప్డేట్ కాదు కదా, కనీసం రాజమౌళి కుటంబ సభ్యుల నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా రాకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. దీనిపై సోషల్ మీడియా లో మహేష్ బాబు అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నారు. రాజమౌళి ట్యాగ్ చేస్తూ ఇంత నిర్లక్ష్యం ఏంటి మా హీరో పట్ల అంటూ పోస్టులు వేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.