
టాలీవుడ్ లో అగ్ర దర్శకులందరూ లాక్ అయిపోతున్నారు. వారి కోసం హీరోలు అటూ ఇటూ మార్చేసుకుంటున్నారు. కరోనా కల్లోలంతో సినిమాలు ఆలస్యమై.. అగ్రదర్శకులు-హీరోలు సినిమాలు ప్రకటించి మరీ ఇప్పుడు ఆలస్యం కారణంగా మరో హీరోతో కమిట్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్ తో కొరటాల, త్రివిక్రమ్ తో మహేష్ బాబులు ఇటీవల కమిట్ అయ్యారు. నిజానికి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ చేయాల్సి ఉంది. కానీ వారి మధ్య కథ నచ్చక ఇటూ అటూ మారిపోయారు.
ఇప్పుడు యువ దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా అదే సమస్య ఏర్పడింది. అనిల్ రావిపూడి ‘ఎఫ్3 ’ తర్వాత నిజానికి మహేష్ బాబుతో చేయాలి. ‘సర్కారి వారి పాట’ సినిమా తర్వాత మహేష్ తో మరో సినిమా చేయాల్సి ఉండేది.
కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో మహేష్ కమిట్ అవ్వడంతో అనిల్ రావిపూడి ఖాళీ అయిపోయాడు. దీంతో ఎప్పటి నుంచి బాలక్రిష్ణ తో మూవీ అనుకుంటున్న రావిపూడి ఇప్పుడు దాన్ని పట్టాలెక్కించే పనిలో పడిపోయాడు.