Mahesh Babu Daughter : సితారా.. ఇటీవల మీడియాలో.. సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లో ఉన్న పేరు. మహేశ్‌బాబు కూడా సాధించలేని, సాధ్యంకాని అరుదైన న్యూయార్క్ టవర్స్‌పై వ్యాపార ప్రకటన పోస్టర్ ద్వారా ఒక్కసారిగా సితారా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత మీడియా, సోషల్ మీడియా ఫోకస్ అంతా సితారాపై పెట్టాయి. గతంలో ఓ టీవీ చానెల్‌లో తండ్రితో కలిసి ప్రోగ్రాం చేసిన సితార.. జడ్జిగా అదరగొట్టింది. తాజాగా ఓ వ్యాపార సంస్థతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ మేరకు యాడ్‌లోనూ నటించింది. ఇందులో సితారా నటనను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
ఫస్ట్ రెమ్యునరేషన్‌పై..
వ్యాపార సంస్థ ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత.. ఆ రెమ్యునరేషన్ ఎవరికి ఇచ్చారు.. ఏం చేశారు అనే విషయాలపై సితాలా చెప్పిన సమాధానాలు ఒకవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే సదరు వ్యాపార సంస్థ సితారాతో రూపొందించిన వ్యాపార ప్రకటన వీడియోను రిలీజ్ చేసింది పీఎంజే జ్వెల్లర్స్ సంస్థ. సుమారు మూడు నిమిషాల నిడివి గల ఈ యాడ్‌లో ఆభరణాల కంటే సితారా నటనపైనే అందరు దృష్టిపెడుతున్నారు. నగలను తక్కువగా చూస్తున్నారు.. సితారను ఎక్కువగా చూస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
పీఎంజే జ్వెల్లర్స్ సంస్థ రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అమెరికా నుంచి ఫంక్షన్‌కు వచ్చిన అమ్మాయిగా సితారా ఇందులో నటించింది. పెద్దలకు నమస్కరించడం, ఫంక్షన్‌కు రావడం తనకు ఇష్టంలేదన్నట్లుగా చేసిన యాక్షన్ ఆకట్టుకుంది. ఇక ఇందులో సితారా అమ్మమ్మ ఫక్షన్‌పై ఆసక్తి పెంచేలా మనవరాలిని బయలక వెళ్దాం అని.. నీకు ఫంక్షన్ ఇష్టం లేదా అని ఓ జ్వెల్లరీ షాప్‌కు తీసుకెళ్తుంది. అక్కడ కూడా ఆభరణాల కొనుగోలు ఇష్టంలేనట్లుగా ఉంటుంది. దీంతో సితారను ఆకట్టుకునేలా రాజమందిరంలోకి యువరాని వెళ్లినట్లుగా తీసిన సన్నివేశం యాడ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇక నిండైన ఆభరణాలతో ‘పీఎంజే జ్వెల్లర్స్.. వేర్ ప్రిన్సెస్ బికమ్ క్వీన్ అనే క్యాప్షన్‌తో యాడ్ ముగించారు. యాడ్ మొత్తంలో ఆభరణాలకంటే సితారా అందం, అభినయం, నటనే యాడ్‌కు హైలెట్‌గా నిలిచింది.