Mahesh Babu : స్టార్ హీరోలకు కాస్లీ కార్స్ సేకరించడం ఒక సరదా. ఏదైనా పబ్లిక్ ఈవెంట్, అవార్డు ఫంక్షన్స్ కి హాజరయ్యేటప్పుడు కోట్లు విలువ చేసే లగ్జరీ కారులో దిగితే ఆ హుందా వేరు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి వద్ద బెంజ్, ఆడీ, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్, లాంబోర్గిని వంటి ప్రముఖ లగ్జరీ బ్రాండ్స్ కి చెందిన కార్లు ఉన్నాయి. ఈ విషయంలో మహేష్ కూడా తక్కువేమీ కాదు. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరిగా ఉన్న మహేష్ ఏడాదికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా ఆయన ఒక కారు కొన్నారు. దాని ధర చూసి… వామ్మో అన్ని కోట్లా అని జనాలు వాపోతున్నారు.
Mahesh Babu : కొత్త కారు కొన్న మహేష్… దాని ధర తెలిస్తే మీ మైండ్ బ్లాక్!
అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రేంజ్ రోవర్ హై ఎండ్ ఎస్వీ కారు సొంతం చేసుకున్నారు. దీని ధర అక్షరాల రూ. 5 కోట్లు అని సమాచారం. ఒక కారు ధర అంతంతే చిన్న విషయం కాదు మరీ. మహేష్ లగ్జరీ కార్స్ కలెక్షన్ లో మరో అరుదైన కారు చేరిందని తెలుస్తుంది. మహేష్ కొత్త కారు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.
మరోవైపు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ కి మహేష్ రెడీ అవుతున్నారు. జులై 12న మొదలు కావాల్సిన లేటెస్ట్ షెడ్యూల్ జులై కి వాయిదా పడింది. మహేష్ ఖాళీగా ఉన్నప్పటికీ ఇతర నటుల డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో షూటింగ్ కి ఇబ్బంది ఏర్పడింది. గుంటూరు కారం మూవీ సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. షూటింగ్ డిలే అవుతుండగా చిత్ర వర్గాల్లో అనుమానాలు నెలకొన్నాయి. గుంటూరు కారం పోస్ట్ పోస్ కానుందని అంటున్నారు.
అనూహ్యంగా గుంటూరు కారం నుండి పూజా హెగ్డే తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా చేస్తున్నారట. దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గుంటూరు కారం చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం రూపొందుతుంది.