Mahesh Babu: సంక్రాంతి వస్తుందంటే థియేటర్లకు కూడా పండుగలా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్దంగా ఉంటాయి. ఈ సందర్భంగా వచ్చే సినిమాలు పోటాపోటీ మీద థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈ సారి సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్దమయ్యాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా రేపు విడుదల కావడానికి సిద్దమైంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్ల లో బిజీ బిజీగా ఉంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్ని సార్లు సంక్రాంతి బరిలో నిలిచారు. ఎన్ని హిట్లు, ఫ్లాప్ లను రుచి చూశారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టక్కరి దొంగ.. మహేష్ బాబు కౌబాయ్ గెటప్ లో కనిపించి.. మెప్పిస్తారు అనుకున్న సినిమా టక్కరి దొంగ. కానీ ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా 2002లో సంక్రాంతి కానుకగా వచ్చింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
ఒక్కడు.. ఒక్కడు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని సంక్రాంతికి అదిరిపోయే హిట్ ను అభిమానులకు కానుకగా ఇచ్చారు మహేష్. ఈయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఒక్కడు.
బిజినెస్మెన్.. ఒక్కడు సినిమా తర్వాత 9 సంవత్సరాలకు బిజినెస్ మెన్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచారు మహేష్ బాబు. అంటే 2012లో ఈ సినిమా రిలీజై థియేటర్లను షేక్ చేసింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. 2013లో ఈ సినిమా రిలీజై సూపర్ హిట్ ను అందుకుంది. మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫిదా చేసింది. వెంకటేష్, మహేష్ బాబు నటించిన ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు.
1 నేనొక్కడినే.. టక్కరి దొంగ సినిమా తర్వాత 2014లో మహేష్ అభిమానులను మరో సారి హట్ చేసిన సినిమా 1 నేనొక్కడినే. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. కానీ ఊహించని విధంగా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.
సరిలేరు నీకెవ్వరు.. 2020లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ ను అందించింది. ఈ సినిమాతో ఈయనకు సాటి లేదు అనే రేంజ్ లో టాక్ వచ్చింది.
మొత్తం మీద మహేష్ బాబు నటించిన ఆరు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇందులో రెండు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటే.. నాలుగు సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. మరి ఈ సారి వచ్చే గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి.