Mahesh Babu Emotional Post: పిల్లలకు తండ్రి కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. దానికి కారణం… ఇంట్లో ఉండి పిల్లల ఆలనాపాలనా చూసుకునేది అమ్మే. అలా మహేష్ కి కూడా అమ్మ ఇందిరా దేవితో ఘాడమైన అనుబంధం ఉంది. అమ్మను మహేష్ ఎంతగానో ప్రేమించేవారు. స్టార్ గా బిజీ అయ్యాక కూడా ఆమె కోసం టైం కేటాయించేవాడు. పిల్లలతో పాటు ఇందిరా దేవి వద్దకు వెళ్లి సమయం గడిపేవారు. ఇక ఇందిరా దేవి పుట్టినరోజు వేడుక కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా జరుపుకునేవారు. ఆ రోజు కుటుంబ సభ్యులు అందరూ ఓ చోట చేరి ఆమెతో కేక్ కట్ చేయించేవారు. ఇందిరా దేవి బర్త్ డే వేడుకల్లో కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు పాల్గొనేవారు.

మహేష్ తో ఎంతో అనుబంధం పెనవేసుకున్న ఇందిరా దేవి మరణం ఆయన్ని కృంగదీసింది. ఇందిరా దేవి మరణం తర్వాత మహేష్ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఇందిరా దేవి అంత్యక్రియలు అనంతరం మహేష్ ఈ పోస్ట్ చేశారు. ఇందిరా దేవి ఒకప్పటి ఫోటో పోస్ట్ చేసిన మహేష్… లవ్ ఎమోజీలు కామెంట్స్ గా పోస్ట్ చేశారు. మాటల్లో వర్ణించలేని తన ప్రేమ, దూరమైన బాధను మహేష్ ఆ విధంగా తెలియజేశారు. ఇక మహేష్ పోస్ట్ కి వేలాది మంది అభిమానులు స్పందించారు.
Also Read: Mahesh Babu: అర్థరాత్రి గోడ దూకి.. మహేశ్ బాబు ఇంట్లోకి వెళ్లిన ఆ దొంగకు ఏమైందో తెలుసా?
మహేష్ పోస్ట్ క్రింద కామెంట్స్ రూపంలో సంతాపం ప్రకటించారు. మహేష్ బాబుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది. కొన్నాళ్లుగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 28న ఇందిరా దేవి ఆరోగ్యం మరింత క్షీణించి తెల్లవారుజామున కన్నుమూశారు. ఇందిరా దేవి మరణాన్ని కుటుంబ సభ్యులు స్వయంగా ధృవీకరించారు. ఇందిరా దేవి మరణ వార్త పరిశ్రమను విషాదంలో నింపివేసింది. చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు ఇందిరా దేవి మృతికి సంతాపం ప్రకటించారు.

నిన్న సాయంత్రం మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగాయి. చిన్న కొడుకు మహేష్ ఇందిరా దేవి అంత్యక్రియలు పూర్తి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ ఇందిరా దేవి మరణం నేపథ్యంలో డిలే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇందిరా దేవి మరణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యేవరకు మహేష్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు.
Also Read: Pooja Hegde: టాప్ ఉన్నా లేనట్లే.. హాట్ సెల్ఫీతో సోషల్ మీడియాను షేక్ చేసిన బుట్టబొమ్మ పూజా!
View this post on Instagram