
ఒకప్పుడు స్టార్ హీరోలు షూటింగ్ సెట్స్ లో పక్కన ఏదైనా చెట్టు ఉంటే అక్కడే సేద తీరేవారట. ఎన్టీఆర్ నుండి మెగాస్టార్ వరకూ ఇదే ఫాలో అయ్యారు. కానీ గత పదేళ్లుగా ట్రెండ్ మారింది. చిన్నాచితకా హీరోలు కూడా క్యారవ్యాన్ కు అలవాటు పడ్డారు. ఒక్క హిట్ వస్తే.. ఇక అతగాడికి నిర్మాతలు అన్ని దగ్గర ఉండి ఏర్పాట్లు చేయాలి. ఇక స్టార్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.
Also Read: రోజాతో విభేదాలపై నాగబాబు షాకింగ్ రియాక్షన్
టాలీవుడ్ సూపర్ స్టార్స్ లగ్జరీ కారవాన్ ను వాడటంలో ఎవరికీ వారు పోటీ పడుతున్నారు. ఆ పోటీలో బన్నీ మొదటి స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ దగ్గర ఉన్న కేరవ్యాన్ ఎవ్వరికి లేదు. అంత గొప్పగా బన్నీ తన క్యారవ్యాన్ ను డిజైన్ చేసుకున్నాడు. అయితే తాజాగా మహేష్ బన్నీ క్యారవ్యాన్ ను తలదన్నేలా.. ఇంకా చెప్పాలంటే ఆ కారవాన్ ఓ మినీ స్టార్ హోటల్ లా మహేష్ బాబు తన క్యారవ్యాన్ ను చేయించుకున్నాడు.
కాగా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మహేష్ వ్యానిటీ వ్యాన్ తెప్పించాడు. మహేష్ టేస్ట్ కు తగ్గట్టు సర్వ హంగులు ఇందులో ఉన్నాయి. ఇక ఇటీవలే ఇది హైదరాబాద్ కి వచ్చింది. దీన్నే మహేష్ బాబు ప్రస్తుతం ఉపయోగిస్తున్నాడు. అన్నట్టు ఈ క్యారవ్యాన్ లో బెడ్ రూమ్, బాత్ రూమ్, కిచెన్, సోఫా సెట్, రివాల్వింగ్ ఛెయిర్, టీవీ వంటివి అన్ని రెగ్యులర్ గా ఉండే సదుపాయాలు ఉన్నాయి.
Also Read: కీర్తి సురేశ్ మహానటి కాదు.. మహానాటు అట
అలాగే అల్ట్రా టెక్నాలాజీతో కూడిన గాడ్జెట్స్, స్టార్ హోటళ్లలో ఉండే ఇంటీరియర్ కూడా ఈ క్యారవ్యాన్ లో ఉంది. ఇక మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్