Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు దేశంలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో ఒకరు. సినిమాకు రూ. 70-80 కోట్లు ఆయన తీసుకుంటున్నారు. నెక్స్ట్ రాజమౌళి సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లకు పైమాటే. మరోవైపు మహేష్ బాబు వ్యాపార ప్రకటనల ద్వారా భారీగా ఆర్జిస్తున్నాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు ఏడాది సంపాదన వంద కోట్లకు పైమాటే. ఈ సంపదను ఆయన వ్యాపారాల్లో పెడుతున్నారు.
మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ ముంబైకి చెందిన మహిళ. ప్రొఫెషనల్ గా నటి అయినప్పటికీ వ్యాపార మెళుకువలు తెలుసు. మహేష్ జీవితంలోకి నమ్రత వచ్చాక ఆయన కెరీర్ కూడా ఊపందుకుంది. కాగా మహేష్ సంపాదనను నమ్రత వ్యాపారాల వైపు మరలిస్తుంది. మహేష్ ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. అలాగే ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబి సినిమాస్ పేరుతో ఒక మల్టీఫ్లెక్స్ నడుపుతున్నారు. హైదరాబాద్ లోని ఏఎంబి సినిమాస్ సక్సెస్ కావడంతో మరొక నగరంపై దృష్టిపెట్టారు.
బెంగుళూరులో ఏఎంబి సినిమాస్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంబి సినిమాస్ భాగస్వామి సునీల్ నారంగ్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మహేష్ వ్యాపార స్ట్రాటజీలు చూసిన పలువురు పక్కా బిజినెస్ మ్యాన్ అంటున్నారు. కాగా మహేష్ మరోవైపు తన సంపాదనలో కొంత భాగం ఛారిటీకి ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.
మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఇప్పటి వరకు వందల మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించాడు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి సినిమాకు సిద్ధం అవుతున్నాడు. త్వరలో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
AMB Bengaluru to start screening soon♥️
Formal pooja done.@amb_cinemas @urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/P42KDH0Mzb
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) April 24, 2024