Mahesh Babu: ఎన్టీయార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు…

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా స్టోరీని మొదట కొరటాల ఎన్టీఆర్ కి వినిపించాడట. కానీ ఆ కథ లో కొన్ని మార్పులు చేయమని ఎన్టీయార్ కొరటాల శివ కి చెబితే ఆ మార్పులు చేయడానికి ఆయన ఇష్టపడలేదు.

Written By: Gopi, Updated On : March 6, 2024 9:15 am

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన క్యారెక్టర్ మరోక హీరో చేయడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. కొన్ని కథలు కొంత మంది హీరోలకు మాత్రమే సెట్ అవుతాయి. దానివల్ల ఆ కథను విన్న హీరోలు ఆ క్యారెక్టర్ తనకు సెట్ కాదు అని అనుకున్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారు. దీని వల్ల దర్శకులు ఆదే సినిమాని వేరే హీరోతో చేసి బ్లాక్ బస్టర్ హిట్లను కొడుతూ ఉంటారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఒక కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే సక్సెస్ ని అందుకున్నాడనే విషయం చాలా మందికి తెలియదు.

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా స్టోరీని మొదట కొరటాల ఎన్టీఆర్ కి వినిపించాడట. కానీ ఆ కథ లో కొన్ని మార్పులు చేయమని ఎన్టీయార్ కొరటాల శివ కి చెబితే ఆ మార్పులు చేయడానికి ఆయన ఇష్టపడలేదు. దానివల్ల ఎన్టీఆర్ ఆ కథను రిజెక్ట్ చేశాడు. ఇక కొరటాల ఆ స్క్రిప్ట్ ను మహేష్ బాబుకి చెప్పి శ్రీమంతుడు సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కొన్ని సీన్లు చేంజ్ చేయమనడంలో తప్పులేదు. ఎందుకంటే తన క్యారెక్టర్ కి కొన్ని సెట్ అవ్వవు అందువల్ల సీన్లు కొన్ని సెట్ చేస్తే సినిమా చేద్దామని చెప్పాడట.

కానీ ఆయన అడిగిన చేంజెస్ సినిమాకి కీలకమైనవి కావడంతో కొరటాల ఆ చేంజెస్ కి ఒప్పుకోలేదు. అలా వీళ్ళిద్దరి మధ్యలో శ్రీమంతుడు సినిమా రావాల్సింది కానీ మిస్ అయింది. ఇక ఆ తర్వాత జనతా గ్యారేజ్ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ అయితే అందుకుంది. ఇక ఇప్పుడు దేవర సినిమాతో మరొకసారి వీళ్ల కాంబినేషన్ లో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ఇండస్ట్రీలో ప్రతి కథ వెనుక ఇలాంటి స్టోరీలే ఉంటాయి.

ఇక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హీరో హిట్ కొట్టడం లేదంటే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హిరో ఫ్లాప్ ని అందుకోవడం లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఎవరు ఏ కథ చేయాలనేది విధి నిర్ణయిస్తుంది అంటు చాలా మంది సినీ మేధావులు చెబుతూ ఉంటారు.