Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించే ఎన్నో సినిమాలు సూపర్ హిట్ ను అందుకుంటాయి. ఒకసారి మిల్క్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులు విజిల్స్ వేస్తూ మరీ వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ మధ్య మహేష్ బాబు సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయ్యారనే చెప్పాలి. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుందనే చెప్పాలి. అయితే సినిమా అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేదా అని మొదట్లో ఫ్యాన్స్ నుంచి చాలా అనుమానాలు వచ్చాయి. అయితే ఈ అనుమానాలకు చెక్ పెట్టారు మేకర్స్. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్న డేట్ కు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ చాలానే కష్టపడ్డారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా చివరి స్థాయికి చేరుకుంది. అయితే ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ రెండో వారంలోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
మేకర్స్ అనుకున్న టార్గెట్ ప్రకారమే షూటింగ్ కూడా సాగుతుంది. ప్రజెంట్ క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా షూట్ పూర్తి కాగానే మహేష్ తన ప్లాన్ చేసుకున్నారట. ఈయన ఎప్పుడు ఖాళీ దొరికినా కూడా విదేశాలకు చెక్కేస్తుంటారని తెలిసిందే. ఈ సారి కూడా గుంటూరు కారం సినిమా షూటింగ్ పూర్తి అవగానే న్యూ ఇయర్ కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారట మహేష్. ఆ వెంటనే తిరిగి వచ్చి సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లలో పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ప్లానింగ్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.