https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు కంటిన్యూస్ ఫోన్ కాల్స్ .. ఎవరికో తెలుసా..?

మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రీకరణ రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఆ సమయంలో రావాలని మహేశ్ బాబు అనుకున్నారట. కానీ ఆ టైమ్ కు సైంధవ్ వేడుక దాదాపు 75 శాతానికి పైగా పూర్తి అయిపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2023 / 01:32 PM IST
    Follow us on

    Mahesh Babu : టాలీవుడ్ లో హీరో విక్టరీ వెంకటేష్ గురించి గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కు ఇది 75వ చిత్రం కావడంతో మేకర్స్ భారీ ఈవెంట్ ను నిర్వహించారు.

    సైంధవ్ మూవీ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, ప్రిన్స్ మహేశ్ బాబు ఇలా హీరోలు అందరూ హాజరవుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హీరోలందరూ పాల్గొంటారని అభిమానులు అంతా భావించారు.

    రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహారించిన ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేశ్ బాబుతో పాటు మరి కొంతమంది హీరోలు హాజరుకాలేకపోయారు. ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విడుదల తేదీ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో మహేష్ బాబు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే షూటింగ్ ను ముగించాలనే ఉద్దేశంతో మహేశ్ బాబు సైంధవ్ వేడుకలకు హాజరుకాలేకపోయారన్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బాబు, వెంకటేష్ మధ్య సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రసమయం నుంచి మంచి బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే.

    అయితే మహేశ్ బాబు సైంధవ్ వేడుకకు వచ్చేందుకు చాలా ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈవెంట్ లో ఏ సమయానికి అయినా వచ్చి జాయిన్ అవ్వాలని భావించారట. ఇందుకోసం మహేష్ బాబు ఈవెంట్ నిర్వహకులకు ఫోన్ కాల్స్ చేశారని తెలుస్తోంది. సాయంత్రం 7 గంటల నుంచి ప్రతి గంటకు ఒకసారి మహేశ్ నిర్వహకులకు కాల్ చేసి ఈవెంట్ ఏ టైమ్ వరకు నడుస్తోందని తెలుసుకున్నారట. అంతేకాదు తాను వచ్చేందుకు ఆలస్యం కానుండటంతో మరో గంట పాటు వేచి ఉండగలరా అని కూడా వారిని కోరారట.

    మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రీకరణ రాత్రి 10.30 గంటలకు ముగిసింది. ఆ సమయంలో రావాలని మహేశ్ బాబు అనుకున్నారట. కానీ ఆ టైమ్ కు సైంధవ్ వేడుక దాదాపు 75 శాతానికి పైగా పూర్తి అయిపోయింది. అప్పటికి మహేశ్ రావాలని భావించగా రానా దగ్గుబాటి అతని సహచరులు మహేశ్ బాబు ఈవెంట్ కు హాజరయ్యేందుకు అంత ఒత్తిడి తీసుకునేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అలాగే ఈవెంట్ కోసం నిరంతరం ఫోన్ చేసిన మహేశ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.