Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu underestimated star director: మహేష్ బాబు ఆ స్టార్ డైరెక్టర్ ను తక్కువ...

Mahesh Babu underestimated star director: మహేష్ బాబు ఆ స్టార్ డైరెక్టర్ ను తక్కువ అంచనా వేశాడా..?

Mahesh Babu underestimated star director: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు… రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. కానీ మురారి, ఒక్కడు లాంటి సినిమాలతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి తన కంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకోవడంలో కీలకపాత్ర వహించాడు. ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సక్సెస్ లతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సన్సేషనల్ హీరోగా మారాడు. ఇక వాళ్ల తండ్రి కృష్ణ గారి సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను సైతం తను సొంతం చేసుకున్నాడు. ఇక అలాంటి మహేష్ బాబు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. వారణాసి సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందాలని ప్రయత్నంలో ఉన్న ఆయన దానికోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. నిజానికి అప్పట్లో మహేష్ బాబు ఆ దర్శకుడిని తక్కువ అంచనా వేశాడు. ఆయన తనకి ఒక కథ వినిపించినప్పటికి ఆ సినిమాని తనతో చేయకపోవడం వల్ల ఆ దర్శకుడు ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం వచ్చిన కూడా రిజెక్ట్ చేశాడు. మొత్తానికైతే ఆయన స్టార్ డైరెక్టర్ గాఎదిగాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే వివి వినాయక్ కావడం విశేషం…

అది, చిన్న కేశవరెడ్డి, ఠాగూర్, దిల్ సినిమాలతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన వినాయక్ మాస్ డైరెక్టర్ గా అవతరించాడు. అలాంటి దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేయాలని ఏరుకోరి మరి ఒక లవ్ స్టోరీ చెబితే మహేష్ బాబు ఆ కథ నైతే రిజెక్ట్ చేశారట…

Also Read: సందీప్ రెడ్డి వంగ టీమ్ లో పనిచేస్తున్న త్రివిక్రమ్, రవితేజ కొడుకులు ఏం చేస్తున్నారు…

తర్వాత పలు సందర్భాల్లో వినాయక్ మహేష్ బాబుకి కథ వినిపించాలనే ప్రయత్నం చేసిన కూడా మహేష్ బాబు అతన్ని పట్టించుకోలేదట. దానివల్ల వినాయక్ సైతం వేరే హీరోలతో సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాధించాడు.

కానీ మహేష్ బాబుతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేకపోయాడు. వినాయక్ అవుట్ డేటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి ఆయన మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశాలను కూడా పూర్తిగా కోల్పోయాడనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version