మహేష్ బాబు – దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31 అనౌన్స్ చేయబోతున్నారు. ఈ మూవీని హారిక, హాసిని సంస్థ నిర్మించబోతోందని సమాచారం.
అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ సెట్టయితే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. మొత్తానికి వీరి హ్యాట్రిక్ సెట్ కావడానికి పదేళ్లు పట్టింది. ఇదికూడా.. అనూహ్యమైన పరిస్థితుల్లో కుదరడం విచిత్రం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సర్కారు వారి పాట’ పూర్తయిన ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు సమాచారం. ‘అతడు’ సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరు పార్థు అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హ్యాట్రిక్ చిత్రానికి ఇదే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
అంతేకాదు.. ఈ చిత్రం అతడుకు సీక్వెల్ అని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ వద్ద పాన్ ఇండియా స్టోరీతోపాటు మరో మూడునాలుగు స్టోరీలు కూడా రెడీ ఉన్నాయట. అయితే.. ఇవేవీ కాకుండా.. మహేష్ కోసం కొత్త కథ సిద్ధం చేసే పనిలో పడ్డాడట మాటల మాంత్రికుడు. అది అతడు మూవీ తరహాలో ఉంటుందని, అతడుకు సీక్వెల్ అని టాక్ వినిపిస్తోంది. సినిమా అనౌన్స్ అయిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.