Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Trivikram Movie: తీవ్ర నిరాశలో మహేశ్..: వెంటనే మార్చాలని చెప్పిన హీరో..

Mahesh Babu Trivikram Movie: తీవ్ర నిరాశలో మహేశ్..: వెంటనే మార్చాలని చెప్పిన హీరో..

Mahesh Babu Trivikram Movie: ‘మహర్షి’ నుంచి వరుస హిట్లతో జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే త్రివిక్రమ్ తో మరోసినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ప్రాజెక్టు ఫైనల్ చేసిన మాటల మాంత్రికుడు ఈ సినిమా స్ట్రాట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. అయితే మహేశ్ ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో అక్కడికి వెళ్లి లొకేషన్స్ చూపిస్తూ కథను చెప్పాడట. అయితే ఓ విషయంలో త్రివిక్రమ్ చెప్పింది మహేశ్ కు నచ్చలేదట. దీంతో త్రివిక్రమ్ గురించి ఎంతో అంచనా వేసిన స్టార్ హీరో ఇప్పుడు కాస్త నిరాశతో ఉన్నట్లు సమాచారం.

Mahesh Babu Trivikram Movie
Mahesh Babu, Trivikram

డైలాగ్ కింగ్ త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో ‘అతడు’ మూవీ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ‘ఖలేజా’ యావరేజ్ గా ఉన్నా మంచి మార్కులే పడ్డాయి. ‘సర్కారు వారి పాట’ జోష్ ఉన్న మహేశ్ మరో సినిమా త్రివిక్రమ్ తో చేసేందుకు ఇప్పటికే సైన్ చేశాడు. ఇందులో భాగంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేశ్ కు కథ చెప్పాడట డైరెక్టర్. అయితే ఫస్టాఫ్ వరకు ఒకే గాని..సెకండాఫ్ వచ్చేసరికి మహేశ్ కు కొన్ని సీన్స్ నచ్చలేదట. ఆ విషయాన్ని మహేశ్ వెంటనే చెప్పాడట.

Also Read: F4 Movie: ఎఫ్4 లో భారీ మార్పులు… ఆ ఇద్దరినీ లేపాయాలని డిసైడైన అనిల్ రావిపూడి!

దీంతో వాటిని సరిచేయడానికి త్రివిక్రమ్ కాస్త టైం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా షెడ్యూల్ ఆగస్టులో అనుకున్నా.. మరికొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సినిమా లేట్ అయినా పర్వాలేదు గానీ.. స్టోరీ బాగా రావాలని మహేశ్ పట్టుబడుతున్నాడట. అంతేకాకుండా త్రివిక్రమ్, మహేశ్ కాంబోలో మూడో సినిమా ‘అతడు’ రేంజ్ లో ఉంటుందని ఇప్పటికే ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టోరీలో తేడా ఉంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని మహేశ్ స్టోరీని మార్చమన్నాడట. దీంతో త్రివిక్రమ్ స్టోరీని మార్చే పనిలో ఉన్నాడట.

Mahesh Babu Trivikram Movie
Mahesh Babu, Trivikram

మహర్షి సినిమా తరువాత సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట వరుసగా హిట్టు కొట్టాయి. ఈ క్రమంలో వచ్చే సినిమా కూడా బాగుంటే ఫ్యాన్స్ లో జోష్ పెంచినట్లవుతుందని అంటున్నారు. అందువల్ల స్టోరీ లైన్ బాగుండాలని మహేశ్ కోరుతున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘మహర్షి’ సినిమాలో అలరించారు. మరోసారి ఈ జోడీ రొమాన్స్ చేయనుంది.

Also Read:Samantha Costly Car: బాప్ రే.. సమంత రేంజ్ ఇంత ఉందా? కాస్ట్లీ కారు చూస్తే అవాక్కే!

Recommended Videos
కుర్రాళ్ళను రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్ || Actress Meera Jasmine Beautiful Looks
చైతూ కోసం బాలీవుడ్ ఆఫర్ ని వదులుకున్న సమంత.. | Samantha Rejects Bollywood Movie For Naga Chaitanya
మహేష్ వల్ల మేజర్ సినిమా భారీ ఫ్లాప్ || Mahesh Babu Impact on Major Movie Flop || Adivi Sesh

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version