Mahesh Babu and Rajamouli : సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు… ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. ఇప్పటివరకు తన ఎంటైర్ కెరీర్ లో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతుంది. దానికి తగ్గట్టుగానే ఆయన భారీ కసరత్తులు చేస్తూ సినిమా మీద ఇప్పుడు భారీ హైప్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి ఏమాత్రం తగ్గకుండా మహేష్ బాబు కష్టపడుతున్నాడు. రాజమౌళి లాంటి దర్శకుడు తో అవకాశం వస్తే ప్రతి హీరో కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మహేష్ బాబుకి వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోవాలనే ప్రయత్నంలో మహేష్ బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది…ఇక మహేష్ బాబు లాంటి నటుడు దొరికితే భారీ విధ్వంసాన్ని సృష్టించొచ్చు అని రాజమౌళి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహేష్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటాడు.
ఆయన నటనలో గాని, అందంలో గాని ఆయనకు ఆయనే సాటి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రాజమౌళి చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే ఇప్పుడు ఈ సినిమాతో ప్రపంచాన్ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు అంటే రాజమౌళికి చాలా ఇష్టం…కానీ ఆయనలో ఆ ఒక్క క్వాలిటీ అంటే అసలు నచ్చదట.
అదేంటి అంటే మహేష్ బాబు ఏ సీనైనా సరే తనే ఓన్ గా నటించి చూపిస్తూ ఉంటాడట. కానీ హీరోలు చాలా విలువైన వారు వాళ్ళకి ఏమైనా జరిగితే సినిమాకి అంతరాయం కలగడమే కాకుండా వాళ్ళ అభిమానుల దగ్గర నుంచి దర్శకులకు భారీగా వార్నింగులు గాని, బెదిరింపులుగాని వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగా సినిమాని కాపాడాలంటే ముందు హీరో జాగ్రత్తగా ఉండాలి. అందుకే రిస్కీ సీన్స్ ఏవైనా సరే డూప్ లతో చేయించడానికి దర్శకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు మాత్రం ఎక్కువగా తమ ఓన్ గా స్టంట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇక ‘వన్ నేనెక్కడినే ‘ సినిమాలో అయితే ఒక బిల్డింగ్ మీద నుంచి మరొక బిల్డింగ్ మీదకి తనే జంప్ చేశాడు.
ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు… కొన్ని అలా చేస్తే బాగానే ఉంటుంది. కానీ ప్రతి షార్ట్ వాళ్లే చేయాలంటే వాళ్లకి ఏదైనా ఇబ్బంది జరగవచ్చు…ఆయన మాత్రం తనే ఓన్ గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడట. మహేష్ లో ఉన్న ఈ ఒక్క క్వాలిటీ రాజమౌళి కి నచ్చదని అలాంటి వాటికి డూపులను వాడుకోవాలని తను సలహాలు ఇస్తూ ఉంటాడట…