Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న విషయం మనకు తెలిసిందే… సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పోటీ పడి మరి ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన రాజమౌళితో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ ఆ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఈ సినిమా కోసం మహేష్ బాబు విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఒక దర్శకుడు మహేష్ బాబు (Mahesh Babu)తో సినిమా చేయడానికి అతనికి నాలుగు కథలను వినిపించారట. అయినప్పటికి ప్రభాస్ మాత్రం ఆ దర్శకుడితో ఇప్పటివరకు సినిమా చేయలేదు.
Also Read : మహేష్ బాబు తో పోటీ పడి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న హీరోలు వీళ్లేనా..?
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న గౌతమ్ మీనన్ (Goutham meenon)కావడం విశేషం… ఇక ఆయన చేసిన సినిమాలు తెలుగులో సైతం మంచి విజయాలుగా నిలిచాయి. ఏ మాయ చేసావే, ఘర్షణ, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబుతో ఒక క్యూట్ లవ్ స్టోరీ ని తెరకెక్కించాలనే ప్రయత్నం చేసినప్పటికి అది సఫలం కాలేదు. కారణం ఏంటి అంటే మహేష్ బాబు మాస్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఆయన లవ్ స్టోరీ లకి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే తన అభిమానులు మాస్ సినిమాలను ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి గౌతమ్ మీనన్ సినిమాలకు మహేష్ బాబు నో చెప్పాడు. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ ఫ్యూచర్ లో అయిన వర్కౌట్ అవుతుందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి.
ఇక ఇప్పటికే మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మారిపోతున్నాడు. కాబట్టి మహేష్ ఇక మీదట గౌతమ్ మీనన్ లాంటి సీనియర్ డైరెక్టర్లతో వర్క్ చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమాలు చేయడానికి యంగ్ డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తూ మంచి కథలతో వస్తున్నారు. కాబట్టి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేయడానికి ఆయన ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా కనిపిస్తున్నారు…
Also Read : గౌతమ్ మొదటి సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తాడా..? తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తున్న సూపర్ స్టార్…