https://oktelugu.com/

Mahesh Babu : AC ఫ్లోర్ లో గేదెలతో షూటింగ్ చేసిన మహేష్ బాబు..ఇదేమి పిచ్చి అండీ బాబోయ్!

మహర్షి సినిమాలో మండుటెండలో మహేష్ బాబు ఒక సన్నివేశం చెయ్యాల్సి వచ్చిందట, అయితే మహేష్ అందుకు ససేమీరా అనడం తో AC ఫ్లోర్ లోనే సెట్స్ వేసి, గేదెలను కూడా అక్కడికే తెచ్చారట,ఈ విషయం తెలుసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 23, 2023 / 10:30 AM IST
    Follow us on

    Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎండ అంటే పడదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాసేపు ఎండ లో నిలబడితే ఆయన చర్మం మొత్తం ఎర్రగా మారిపోతుంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఆయన షూటింగ్ లో సొమ్మసిల్లి క్రింద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మహేష్ బాబు అప్పటి నుండి ఎండల్లో సినిమాలు చెయ్యడం ఆపేసాడు. ఇప్పుడు ఆయన రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

    రాజమౌళి తో సినిమా అంటే హీరోలకు ఎంత నరకం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎండ , వానా, చలి అని తేడా లేకుండా తన హీరోలను ఇష్టమొచ్చినట్టు వాడేస్తాడు.ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ మరియు రానా దగ్గుపాటి అందుకు ఉదాహరణ. అలాంటి రాజమౌళి తో ఎంతో సున్నితంగా ఉండే మహేష్ బాబు ఎలా సినిమా చేస్తాడు అనే సందేహం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఉండేది.

    పైగా రాజమౌళి తో చెయ్యబోతున్న సినిమా లో యాక్షన్ సన్నివేశాలు కోకొల్లలుగా ఉంటాయట. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మహేష్ ని కష్టపెట్టకుండా రాజమౌళి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సహాయం తో ఈ చిత్రం లోని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాడట.360 డిగ్రీలలో మహేష్ బాబు ఫోటోలను తీసుకొని ఈ టెక్నాలజీ ఉపయోగించబోతున్నట్టు సమాచారం.ఇది ఇలా ఉండగా మహేష్ కి ఎండల్లో షూటింగ్ చెయ్యడానికి ఎంత చిరాకు అనే విషయానికి ఒక ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    మహర్షి సినిమాలో మండుటెండలో మహేష్ బాబు ఒక సన్నివేశం చెయ్యాల్సి వచ్చిందట, అయితే మహేష్ అందుకు ససేమీరా అనడం తో AC ఫ్లోర్ లోనే సెట్స్ వేసి, గేదెలను కూడా అక్కడికే తెచ్చారట,ఈ విషయం తెలుసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రీసెంట్ గా ఆయన త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలకు మహేష్ బాబు పూర్తిగా నో చెప్తున్నట్టు సమాచారం.