Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: ప్రభాస్ ఏంటది.. ఇన్ని రోజులకు కల్కిపై సంచలన కామెంట్స్ చేసిన మహేష్ బాబు

Mahesh Babu: ప్రభాస్ ఏంటది.. ఇన్ని రోజులకు కల్కిపై సంచలన కామెంట్స్ చేసిన మహేష్ బాబు

Mahesh Babu: కల్కి మూవీ చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనేపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతుంది. మహేష్ కి ఓ అలవాటు ఉంది. కొత్తగా విడుదలైన చాలా చిత్రాలు ఆయన తప్పక చూస్తారు. అలాగే సదరు చిత్రాలకు తన రివ్యూ ఇస్తారు. ఈ మధ్య మహేష్ బాబు రివ్యూలు ఇవ్వడం తగ్గించాడు. ప్రొఫెషన్ లో బిజీ కావడం కూడా ఒక కారణం.

మహేష్ బాబు కొద్దిరోజులుగా హైదరాబాద్ లో లేడు. తిరిగి వచ్చిన మహేష్ వెంటనే కల్కి చిత్రం చూశాడు. ట్విట్టర్ ఎక్స్ లో కల్కి చిత్రం ఎలా ఉందో అభిమానులకు తెలియజేశాడు. ”కల్కి మూవీ నా మైండ్ బ్లాక్ చేసింది. వావ్ అంతే… నీ భవిష్యత్తు దృష్టికోణానికి హ్యాట్సాఫ్ నాగ్ అశ్విన్. మూవీలోని ప్రతి ఫ్రేమ్ కళాఖండం.

అమితాబ్ సర్… మీ స్క్రీన్ ప్రెజెన్స్ సాటిలేనిది. కమల్ సర్… మీకు మాదిరే మీరు చేసే ప్రతి పాత్ర అసాధారణం. ప్రభాస్… ఎప్పటిలాగే ఓ గొప్ప పాత్రను అలవోకగా పోషించావు. దీపికా పదుకొనె… నువ్వు అమేజింగ్. వైజయంతీ మూవీస్, కల్కి టీమ్ కి శుభాకాంక్షలు”, అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. కల్కి మూవీ దర్శక నిర్మాతలు, నటులపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ ఫ్యాన్స్ మహేష్ కల్కి చిత్రం పై స్పందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కల్కి మూవీ వరల్డ్ వైడ్ రూ. 900 కోట్ల వసూళ్లు దాటేసింది. వెయ్యి కోట్ల దిశగా అడుగులు వేస్తుంది.ఓవర్సీస్ లో కల్కి చిత్రానికి భారీ ఆదరణ దక్కుతుంది. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ రికార్డు కల్కి బ్రేక్ చేయడం విశేషం. భారతీయుడు 2 విడుదలయ్యే వరకు కల్కి చిత్రానికి పోటీ లేదు. అది కలిసొచ్చే అంశం. దర్శకుడు కల్కి 2 కూడా ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంత షూటింగ్ కూడా జరిగిందట. అయితే కల్కి 2 విడుదలకు ఇంకా చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు.

Exit mobile version