Sarkaru Vaari Paata Movie Trailer: ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ మహేష్ అభిమానులకు ఫుల్ కిక్ ను ఇస్తోంది. ట్రైలర్ లోని భారీ విజువల్స్, మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగే లవ్ షాట్స్.. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కి సంబంధించిన మెయిన్ షాట్స్ , ముఖ్యంగా మహేష్ ఎలివేషన్ షాట్స్.. ఇక మనీ నేపథ్యంలో మహేష్ చెప్పే డైలాగ్స్, మరియు మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి.
ముందు చెప్పినట్టుగానే ఈ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తోంది. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, మహేష్ పాత్రలోని షేడ్స్ ను, ముఖ్యంగా సినిమాలోని కీలకమైన కథా నేపధ్యాన్ని… ఆ నేపథ్యం తాలూకు మెయిన్ సీక్వెన్సెస్ ఎస్టాబ్లిష్ షాట్స్ ను, మరియు మనీ చుట్టూ వచ్చే సీన్స్ తాలూకు ఎలివేషన్ షాట్స్ ను పరశురామ్ ట్రైలర్ లో చాలా బాగా కట్ చేశాడు.
Also Read: Bigg Boss Telugu OTT: ఆ లేడీ కంటెస్టెంట్ బ్రా విప్పమన్న యాంకర్ శివ.. వీడియోతో కడిగేసిన నాగార్జున
ఇక ట్రైలర్ లో మహేష్ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ లోని విజువల్స్ ను చూస్తే అర్ధం అవుతుంది.. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతుంది అని. మెయిన్ గా మహేష్ పాత్రలోని వేరియేషన్స్ తో పాటు అతని ఆలోచనా విధానాన్ని, అలాగే అతని పరిస్థితులను కూడా చాలా బాగా చూపించారు. నటన పరంగా ఇక మహేష్ అద్భుతంగా నటించాడు.
భారీ అంచనాలకు తగ్గట్టు సాగిన ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు.
ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది. తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుంచి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంని ది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read: Dil Raju vs Warangal Srinu: దిల్ రాజుకి మళ్లీ ఘోర అవమానం.. అసలు ఏం జరిగింది అంటే ?