Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ రోజు కీర్తి సురేష్ – మహేష్ లతో పాటు మిగిలిన ప్రధాన పాత్రల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ లోనే మహేష్ – కీర్తి సురేష్ ల పెళ్లి చూపులు సీన్ కూడా ఉందట.
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి అయింది. ముందుగా చెప్పిన ప్రకారమే ‘సంక్రాంతి’ కానుకగా ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ క్రేజీ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల ప్రస్తావన ప్రధానంగా ఉండబోతుంది. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి ఆ డబ్బును ఎలా రాబట్టాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. ఇక ఆ మధ్య దుబాయ్ షెడ్యూల్ లో ఈ బ్యాంక్ సీన్స్ నే షూట్ చేశారు.
కాగా ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయట. అలాగే రీసెంట్ గా జరిగిన ‘గోవా’ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు విలన్స్ పై కూడా భారీ యాక్షన్ సీన్స్ ను షూట్ చేశారు. ఇప్పుడు చేస్తోన్న పెళ్లి చూపులు సీన్ కూడా సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోందట.
తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, కథానాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. మైత్రీ – 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.