Sarkaru Vaari Paata Records: కరెక్ట్ సినిమా పడాలే కానీ మహేష్ బాబులో ఓ ‘పోకిరి’ బయటకు వస్తాడు. రికార్డులు అన్నీ కొల్లగొడుతాడు. పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన ‘సర్కారువారి పాట’ ఈరోజు రిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

రిలీజ్ కు రెండు రోజుల ముందు ఆన్ లైన్ లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సర్కారువారి పాట టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ చూస్తే తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన అడ్వాన్స్ బుకింగ్ ఆధారంగానే ఈ లెక్కలుంటే పాజిటివ్ టాక్ ఉంటే మరింతగా కలెక్షన్లు వస్తాయని ఆశిస్తున్నారు.
Also Read: Mahesh Babu Daughter Sitara: మహేష్ కూతురు ‘సితార’ డ్రీమ్ మాములుగా లేదుగా.. ఇది షాకింగే
కాగా అడ్వాన్స్ బుకింగ్స్ లో మహేష్ ‘సర్కారువారి పాట’ మూవీ.. కేజీఎఫ్2 అధిగమించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ సినిమా కేజీఎఫ్2 కంటే ఎక్కువ బుకింగ్స్ నమోదు కావడం విశేషం. మొదటి రోజు సర్కార్ వారి పాట 6 కోట్ల 60 లక్షల బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్2 తొలిరోజు 6 కోట్లలోపే అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే 325 షోలలో 162 షోలు ఫుల్ అయ్యాయి. విదేశాల్లోనూ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.

కాగా సర్కారువారి పాట మూవీకి మిక్స్ డ్ టాక్ రావడంతో ఈ వీకెంట్ ఫర్వాలేదనుకున్నా సోమవారం నుంచి కలెక్షన్లు ఎలా ఉంటాయన్న దానిపైనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? కలెక్షన్లు రికవరీ చేస్తుందా? అన్నది ఆధారపడి ఉంది.
Also Read:Poonam Bajwa నైట్ వేర్ లో మతిపోయే అందాలు ఆరబోసిన పూనమ్ బజ్వా.. గ్లామర్ ఫొటోలు
[…] Read: Sarkaru Vaari Paata Records: మహేష్ రికార్డుల వేట.. కేజీఎ… […]