Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సినిమాలన్నీ పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఒక్క సినిమా కూడా చేయలేదు. కారణం ఏదైనా కూడా ఇప్పుడు ఆయన డైరెక్టుగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అతనితో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు అనుకున్నప్పటికి వాళ్ళు ఒకసారి కాకపోతే మరొకసారైనా వాళ్లకు సినిమాలు చేసే అవకాశామైతే వచ్చింది. కానీ ఒక దర్శకుడిని మాత్రం దాదాపు 20 సంవత్సరాల నుంచి మహేష్ బాబు తన వెంట తిప్పుకుంటున్నాడు. అయినప్పటికి అతనితో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే శేఖర్ కమ్ములగా తెలుస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా చేసిన ‘గోదావరి’ సినిమా కథని మహేష్ బాబుకు వినిపించాడు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
కానీ మహేష్ బాబు మాత్రం ఆ సినిమా కథ చాలా సాఫ్ట్ గా ఉందని అందువల్లే దానిని రిజెక్ట్ చేశానని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఆ సినిమా తర్వాత ‘లీడర్’ సినిమా కథని కూడా మహేష్ బాబుకి వినిపించారట. కానీ అప్పుడు తనకు పాలిటిక్స్ సినిమాలు చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేష్ బాబు తప్పించుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘ఫిదా’ సినిమా స్టోరీని కూడా మొదటి మహేష్ బాబు కి చెప్పాడు.
కానీ మహేష్ బాబు మాత్రం ఆ మూవీ చేయడంలో తను ఇంట్రెస్ట్ చూపించలేదు. దానికి తోడుగా ఆ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఉందని తను చెప్పారట… లవ్ స్టోరీ సినిమాని సైతం మహేష్ బాబు తో చేయాలని శేఖర్ కమ్ముల భావించాడు కానీ మహేష్ బాబు ఒప్పుకోలేదు. మొత్తానికైతే 20 సంవత్సరాల నుంచి శేఖర్ కమ్ములను తన వెంట తిప్పుకుంటున్నాడు.
కానీ ఒక్క సినిమా కూడా చేయడం లేదనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక మరి కొంతమంది మాత్రం మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గ కథను తీసుకు వస్తే ఆయన చేస్తాడు. కానీ అన్ని చిన్న కథలతో వస్తే ఆయన ఎలా చేస్తాడు అంటూ మహేష్ బాబుకు సపోర్టుగా మాట్లాడుతున్నారు…