Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super star Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలను ఇటీవలే ఒడిశా ప్రాంతంలో మొదలు పెట్టి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసారు. రెండవ షెడ్యూల్ ని త్వరలోనే ప్రారభించనున్నాడు. కాస్త గ్యాప్ రావడంతో మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి విదేశీ ట్రిప్ కి వెళ్ళాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు కూడా కెమెరాలకు తన పాస్ పోర్ట్ ని చూపిస్తే కామెడీ చేశాడు. ఇదంతా పక్కన పెడితే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram gopal Varma) ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిపాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘రాజమౌళి అప్పట్లో ఒక సినిమాని సూపర్ హిట్ ఎలా చెయ్యాలి అనే దానిపై ఒక పుస్తకం రాశాడు. కానీ ఎప్పుడైతే ఆయన మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని చూశాడో, అప్పుడే ఆ పుస్తకాన్ని చింపేశాడు. కారణం బిజినెస్ మ్యాన్ చిత్రం లో హీరోది నెగటివ్ క్యారక్టర్. కేవలం ఆ క్యారక్టర్ కారణంగానే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రాజమౌళి సినిమాల్లో హీరోలు నెగటివ్ యాంగిల్ లో కనిపించరు, ఆయన ఫార్ములా నే వేరు. కేవలం ఆ ఫార్ములా ని అనుసరిస్తే సూపర్ హిట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఒక పుస్తకం రాశాడు. కానీ ఒక యాంటీ హీరో మూవీ సూపర్ హిట్ అవ్వడంతో, ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా ఈ అంశాలే ఉండాలి అనే కొలతలు అవసరం లేదు అనే ఆ పని చేశాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘దూకుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత, కేవలం మూడు నెలల గ్యాప్ లో విడుదలైన చిత్రమిది.
ఎదో సాధించాలి అని ముంబై కి వచ్చే హీరో రాజకీయనాయకులను, బడా వ్యాపారవేత్తలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఫలితంగా ఈ చిత్రం ఆరోజుల్లోనే 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేయగా, రీ రిలీజ్ లోనూ బ్లాక్ బస్టర్ రన్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసినప్పుడే పాపం పూరి జగన్నాథ్ ని చూస్తే ఆయన అభిమానులకు జాలి వేస్తూ ఉంటుంది, ఎలా డైరెక్టర్ ఎలా అయిపోయాడు అంటూ ఇలాంటి వింటేజ్ సినిమాలను చూసినప్పుడు అనుకుంటూ ఉంటారు. పూరి జగన్నాథ్ మళ్ళీ ఆ రేంజ్ ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.