Mahesh babu and Rajamouli : రాజమౌళి(SS Rajamouli) తో సినిమా అంటే హీరోలు ఎగిరి గంతులేసినంత తేలికగా ఉండదు. ఆయనతో పని చేయడం అంటే ఒళ్ళు హూనం చేసుకోవడమే. #RRR మూవీ డాక్యుమెంటరీ వీడియో ని చూసి మీ అందరికీ జాలి కలిగి ఉంటుంది. కుర్ర హీరోలైన రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR) లు ఊపిరి అండగా ఆయాసపడుతూ ఒక మూలాన కూర్చున్న వీడియోలు అభిమానులను భయబ్రాంతులకు గురి చేసింది. ఈ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నాడేంటి రాజమౌళి. కుర్ర హీరోలైన ఎన్టీఆర్ , రామ్ చరణ్ లే తట్టుకోలేకపోయారు, ఇక 50 ఏళ్ళ వయస్సు ఉన్న మహేష్ బాబు(Superstar Mahesh Babu) ఎలా తట్టుకోగలడు, అంత తేలికైన విషయం కాదు రాజమౌళి తో సినిమా అంటే అని మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు. రీసెంట్ గానే మహేష్ తో సినిమా మొదలెట్టి ఒడిశా లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు డైలాగ్ రైటర్ గా మారిన స్టార్ డైరెక్టర్!
రెండవ షెడ్యూల్ కోసం త్వరలోనే వర్క్ షాప్ మొదలు కానుంది. అయితే చిన్న గ్యాప్ దొరికితే విదేశాలకు తన కుటుంబం తో కలిసి చెక్కేసే మహేష్ బాబు ని గమనించి, అతని పాస్ పోర్ట్ ని లాక్కున్నట్టు రాజమౌళి గతంలో ఒక వీడియోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంటే మహేష్ ఒకవేళ విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా రాజమౌళి అనుమతి ని తీసుకొని వెళ్ళాలి. షూటింగ్ మొదలయ్యాక పాపం మహేష్ కి ఇక విదేశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందే అని అందరు అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆయన తన భార్య, కూతురు తో కలిసి విమానాశ్రయం లో కెమెరాలకు పాస్ పోర్ట్ ని చూపించి మరీ వెళ్ళాడు. రీసెంట్ గానే తిరిగి వచ్చేశాడు. రాజమౌళి అనుమతి ని ఇవ్వడు అనుకున్నామే, ఎలా ఇచ్చాడు అని సోషల్ మీడియా లో మహేష్ అభిమానులు చర్చించుకున్నారు.
కానీ రెండవ షెడ్యూల్ మొదలు అవ్వడానికి చాలా సమయం ఉంది. ఈ షెడ్యూల్ తర్వాత నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ఉంటాయి, విరామం లేకుండా వర్క్ షాప్స్ ఉంటాయి. మహేష్ బాబు కి కనీసం నిద్రపోవడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. అందుకే ఆయన ఇంతటి వర్క్ రాబోయే రోజుల్లో ఉంది కాబట్టి కాస్త విదేశాలకు వెళ్లి ఛిల్ల్ అయ్యి వస్తానని చెప్పడంతో రాజమౌళి కూడా అందుకు అంగీకరించాడని, అందుకే మహేష్ వెళ్లాడని, ఇప్పుడు తిరిగి వచ్చేశాడని, ఇక ఆయన పని అయిపోయినట్టే, రాజమౌళి సానబెడుతాడని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది మహేష్ పుట్టినరోజున ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట రాజమౌళి, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలియనుంది.
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కృష్ణ సీన్ ను రీక్రియేట్ చేస్తున్నారా..?