Mahesh Babu Rajamouli: రాజమౌళి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…గతంలో ఆయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు అతని స్థాయిని పెంచాయి. ఇక దాంతో ఆయన మరోసారి పాన్ వరల్డ్ నేపథ్యంలో ఈ సినిమాని చిత్రీకరిస్తున్నాడు. మరి ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పాన్ వరల్డ్ లో ఈ సినిమా ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటుంది.
Also Read: ‘వార్ 2′ ఎఫెక్ట్..’దేవర 2’ ని ఆపేసిన ఎన్టీఆర్..మరో యంగ్ హీరో కోసం కొరటాల ప్రయత్నాలు!
తద్వారా రాజమౌళి తనను తన స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.అందులో మహేష్ బాబు ముఖం కనిపించలేదు కానీ ఆయన మెడలో ఢమరుకం, శివలింగం లాంటి ఆకారంలో లాకెట్స్ అయితే కనిపించాయి. ఇక దీన్ని బట్టి చూస్తుంటే మహేష్ బాబు ఈ సినిమాలో శివుడి భక్తుడిగా కనిపించబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇంక దానికి సంబంధించి ఒక సీన్ కూడా ఉండబోతుందట. మరి బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే సన్నివేశం ఎంత మంచి పాపులారిటిని సంపాదించుకుందో మనందరికి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో కూడా మహేష్ బాబు దేవుడిని ఆరాధించే సీను ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందట. మరి ఏది ఏమైనా ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం ఈస్ట్ ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది…
మరి రాజమౌళి అనుకున్నట్టుగా ఈ సినిమాను తీసి మరోసారి ప్రపంచ ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతాడా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. నిజానికి మహేష్ బాబు లాంటి నటుడు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కే పరిమితమయ్యాడు. అతనికి పాన్ ఇండియాలో కూడా పెద్దగా మార్కెట్ అయితే లేదు.
Also Read: సినీ ఇండస్ట్రీపై పడ్డ నారా లోకేష్.. పవన్ కు కీలక విన్నపం.. టాలీవుడ్ షేక్!
ఇక అలాంటి ఒక హీరోని పెట్టుకొని భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు అంటే నిజంగా రాజమౌళి చాలా గ్రేట్ అనే చెప్పాలి… తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…