నేడు ‘నర్సుల దినోత్సవం’, ఇక ఇంటర్నేషనల్ నర్సెస్ డే అంటూ ప్రముఖులు నర్సులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చెప్పాలి కూడా. ఈ భయంకరమైన కొవిడ్ రోజుల్లో ఇంట్లో నుండి కాలు బయట పెట్టడానికి మగాళ్లే వణికిపోతుంటే.. ఏకంగా కోవిడ్ పేషంట్లకు ట్రీట్మెంట్ అందిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలను అందిస్తోన్న ఘనత ఒక్క నర్సులకే చెందుతుంది.
వైద్యో నారాయణో హరీ అన్నారు పెద్దలు. వైద్యుడిని దేవుడితో సమానం అని పోల్చి చెప్పిన పెద్దలు, వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. నిజంగా కొంతమంది వైద్యులు దేవుళ్ళలానే సేవలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా బారిన పడి అల్లాడిపోతోన్న వారికి భరోసాగా నిలిచి వారిని తిరిగి బతికిస్తున్నారు.
ఈ క్రమంలో డాక్టర్లు కంటే కూడా నర్సులకే ఎక్కువ ప్రమాదం. అయినప్పటికీ డాక్టర్లు కంటే కూడా, కరోనా రోగులకు నర్సులే ఎక్కువ సేవ చేస్తున్నారు. అందుకే అలాంటి నర్సులకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కూడా కృతజ్ఞతలు చెబుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నర్సులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు.
మహేష్ ట్వీట్ లో మెసేజ్ పోస్ట్ చేస్తూ..‘కొవిడ్ సెకండ్ వేవ్ కూడా మనలను కష్టమైన పరిస్థితుల్లోకి నెట్టింది. కాబట్టి, మనమంతా బాధ్యతగా ఇళ్లలోనే ఉందాం. లాక్ డౌన్ ప్రొటోకాల్‌ను పాటిద్దాం. ఇక ఈ కరోనా సెకండ్ వేవ్ లో కూడా నర్సులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అనీర్వచనమైన సేవలను అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. మీరు చేస్తోన్న సేవలు అసామాన్యమైనవి. అలాగే మీ కరుణతో, మీ సానుభూతితో, మీ బలంతో ఈ ప్రపంచానికి తగిలిన గాయం త్వరగా మానిపోతుంది. మేమందరం మీకు అండగా ఉండటమే కాదు, మీ పట్ల సదా కృతజ్ఞతతో ఉంటాము’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
This one is for all our nurses on the frontlines battling the COVID-19 second wave under such difficult circumstances… Your extraordinary contribution is unparalleled. #InternationalNursesDay
— Mahesh Babu (@urstrulyMahesh) May 12, 2021