Mahesh Babu New Look: కొందరు చాలా అందం గా ఉంటారు. వాళ్ల అందం ముందు చందమామ కూడా చిన్నబోతుందనే చెప్పాలి. ఇక అలాంటి వాళ్ళని మళ్లీ మళ్లీ చూడ్డానికి మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో మహేష్ బాబు మంచి అందగాడు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు శోభన్ బాబుని చాలా అందం గా ఉండేవాడు. ఆయన్ని అప్పుడు అందగాడు ఆఫ్ తెలుగు.ఇండస్ట్రీ అనేవారు.
ఇప్పుడు మహేష్ బాబు ను అందగాడు అంటున్నారు. ప్రస్తుతం 50 సంవత్సరాలకు చేరువవుతున్న కూడా మహేష్ బాబు పాతికేళ్ల కుర్రాడిలా చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఇక హీరో అంటే ఇలాగే అందంగా ఉండాలని చాలామంది జనాలు మహేష్ బాబుని హీరో అనే పదానికి సింబాలిక్ గా వాడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు కొంత వరకు ఈ సినిమా విషయంలో డిసప్పాయింట్ అయిన విషయం అయితే మనకు తెలిసిందే.
ఇక ప్రతి సినిమా తర్వాత మహేష్ బాబు ఒక ట్రిప్ కి అయితే వెళ్తాడు. ఇక ఇప్పుడు కూడా జర్మనీకి వెళ్ళాడు ,అయితే ఎప్పుడూ ఫ్యామిలీ తో ట్రిప్ కి వెళ్ళే మహేష్ బాబు ఈసారి మాత్రం ఒక్కడే జర్మనీకి వెళ్ళాడు. దానికి కారణం ఏంటి అంటే మహేష్ బాబు రాజమౌళి తో చేయబోయే సినిమాకి సంబంధించిన వర్క్ మీద జర్మనీ కి రప్పించాడనే వార్తలు అయితే వచ్చాయి. ఇక ఇదే క్రమం లో జర్మనీకి వెళ్లిన మహేష్ బాబు ఈ రోజే హైదరాబాద్ కి తిరిగి వచ్చాడు. ఇక ఈ క్రమం లోనే ఆయన కెమెరాకి చిక్కాడు. దాంట్లో ఒక డిఫరెంట్ లుక్ లో మహేష్ బాబు కనిపించడంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక మహేష్ బాబు జర్మనీ కి వెళ్లడానికి గల కారణం ఏంటి అనే విషయం లో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
రాజమౌళి మహేష్ బాబును జర్మనీకి తీసుకెళ్ళి అక్కడ తన సినిమాకి సంబంధించిన మేకోవర్ చేయించినట్లు గా తెలుస్తుంది. అయితే ఈ లుక్కులో మహేష్ బాబు చాలా అందంగా ఉండటమే కాకుండా ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టు గా ఉండటంతో ఈ ఫోటో మీద మహేష్ బాబు అభిమానులు వాళ్ల అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…