Mahesh Babu New Look: మహేష్ బాబు SSMB 29 కొరకు టోటల్ మేకోవర్ అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో సడన్ గా దర్శనమిచ్చిన మహేష్ లుక్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. మహేష్ బాబు లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది..
మహేష్ బాబు-రాజమౌళి SSMB 29 షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు. మహేష్ బాబు తనయ సితార బర్త్ డే నేపథ్యంలో ఆయన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లారు. సితార బర్త్ డే వేడుకలు శ్రీలంకలో మహేష్, నమ్రత, గౌతమ్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. తమ వెకేషన్ ఫోటోలు సితార ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. వెకేషన్ ముగించుకున్న మహేష్ తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ మీడియా కంటపడ్డారు. ఈ క్రమంలో ఆయన లేటెస్ట్ లుక్ రివీల్ అయ్యింది. SSMB 29 కోసం మహేష్ షాకింగ్ మేకోవర్ అయ్యారు.
మహేష్ గత చిత్రాల్లో ఎన్నడూ గుబురు గడ్డంతో కనిపించింది లేదు. లైట్ బెర్డ్, ఓ మోస్తరు లాంగ్ హెయిర్ కొన్ని చిత్రాల్లో ట్రై చేశారు. రాజమౌళి తన హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేయాలని అనుకుంటారు. SSMB 29 క్యారెక్టరైజేషన్ లో భాగంగా మహేష్ లాంగ్ హెయిర్, థిక్ బెర్డ్ పెంచారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సాహసవీరుడి రోల్ చేస్తున్నారు. జంగిల్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ డ్రామాలో ఆయన ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా కనిపిస్తాడని సమాచారం. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో SSMB 29 రూపొందిస్తున్నారు.
మహేష్ బాబు వెకేషన్ ముగిసిన నేపథ్యంలో నెక్స్ట్ షెడ్యూల్ పట్టాలెక్కనుంది. మహేష్ కి జంటగా ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. విదేశీ నటులు, సాంకేతిక నిపుణులు SSMB 26కి పని చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కలదు. ఫస్ట్ టైం మహేష్-రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి.
మరోవైపు అతడు రి రీలీజ్ కి సిద్ధం అవుతుంది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. మహేష్ నటించిన పోకిరి, ఖలేజాతో పాటు పలు చిత్రాలు రీరిలీజ్ అయ్యాయి. అతడు చిత్రానికి ఫ్యాన్స్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అతడు నిర్మాత మురళీ మోహన్ ని చాలా కాలంగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన అంగీకారం తెలిపారు. అతడు చిత్రం ఆగస్టు 9న థియేటర్స్ లోకి రానుంది.