https://oktelugu.com/

Mahesh Babu New Ad: మ‌హేశ్ బాబు ఖాతాలో కొత్త యాడ్‌.. వీడియో హాలివుడ్ రేంజ్‌లో ఉందిగా..!

Mahesh Babu New Ad: తెలుగు సినీ చ‌రిత్ర‌లో మ‌హేశ్ బాబుది చెర‌గ‌ని ముద్ర‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఏ హీరో చేయ‌లేద‌నే చెప్పాలి. ఇలాంటి ప్ర‌యోగాలే ఆయ‌న్ను సెప‌రేటుగా నిలిపాయి. సూప‌ర్ స్టార్‌గా ఆయ‌న‌కు యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయితే మిగ‌తా స్టార్ హీరోల్లానే ఆయ‌న కూడా ఏడాదికి కేవ‌లం ఒక్క సినిమానే చేస్తున్నారు. ఇక ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమా […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 19, 2022 / 12:56 PM IST
    Follow us on

    Mahesh Babu New Ad: తెలుగు సినీ చ‌రిత్ర‌లో మ‌హేశ్ బాబుది చెర‌గ‌ని ముద్ర‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఏ హీరో చేయ‌లేద‌నే చెప్పాలి. ఇలాంటి ప్ర‌యోగాలే ఆయ‌న్ను సెప‌రేటుగా నిలిపాయి. సూప‌ర్ స్టార్‌గా ఆయ‌న‌కు యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అయితే మిగ‌తా స్టార్ హీరోల్లానే ఆయ‌న కూడా ఏడాదికి కేవ‌లం ఒక్క సినిమానే చేస్తున్నారు.

    Mahesh Babu New Ad

    ఇక ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమా వ‌చ్చి దాదాపు రెండేండ్లు కావ‌స్తోంది. స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత ఆయ‌న సినిమా రాలేదు. ఇక‌పోతే ఆయ‌నకు సౌత్ లో ఉన్న క్రేజ్ ఆయ‌న‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ తీసుకు వ‌స్తోంది. దీంతో ఇటు సినిమాల‌తో పాటు యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు మ‌హేశ్‌. గ‌తంలో త‌మ్స‌ప్ యాడ్ లో మ‌హేశ్ న‌టించాడు.

    Also Read: మ‌హేశ్ బాబు సినిమాలో బాల‌య్య న‌టిస్తారా? రాజ‌మౌళి ఆఫ‌ర్ కు ఓకే అనేస్తాడా?

    చాలా కాలం పాటు ఆ సంస్థ‌కు మ‌హేశ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయ‌న ఖాతాలో మ‌రో యాడ్ వ‌చ్చి ప‌డింది. అది కూడా పెద్ద కూల్ డ్రింక్ సంస్థ అయిన మౌంటెన్ డ్యూ. ఇది చాలా పెద్ద సంస్థ‌. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ కంపెనీకి క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. సౌత్‌లో బిజినెస్‌ను పెంచుకునే క్ర‌మంలో మ‌హేశ్‌తో యాడ్ తీసింది ఈ సంస్థ‌.

    ఇక ఈ విష‌యాన్ని మ‌హేశ్ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. ఈ యాడ్‌లో బూర్జు ఖ‌లీఫా మీదుగా మ‌హేశ్ చాలా స్పీడుగా బైక్ మీద సాహ‌సం చేస్తున్న‌ట్టు మ‌హేశ్ క‌నిపిస్తాడు. భ‌యం వ‌దులు గెలిచి చూడు అన్న‌ట్టు ఈ యాడ్‌ను రూపొందించాడు. ఈ యాడ్ హాలివుడ్ రేంజ్‌లో ఉంది. ఇందులో మ‌హేశ్ లుక్స్ అదుర్స్ అన్న‌ట్టు ఉన్నాయి. ఈ విష‌యం తెలుసుకుని మ‌హేశ్ ఫ్యాన్స్ తెగ సంబుర ప‌డుతున్నారు.

    Also Read: ఆమె టచ్ తో మహేష్ బాబు పొగరు అణిచివేయబడిందా?

    Tags