Jayakrishna Debut Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుంచి మహేష్ బాబు వరకు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ స్టార్ డమ్ ను విస్తరించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పాన్ వరల్డ్ నేపథ్యంలో ముందుకు సాగుతున్నాడు. మహేష్ బాబు బావ గా ఇండస్ట్రీకి ఏంటి ఇచ్చిన సుధీర్ బాబు సైతం చిన్న చిన్న సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక అలాంటి మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు వారణాసి సినిమాతో తెచ్చుకోబోతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య అయిన రమేష్ బాబు హీరోగా పలు సినిమాలు చేసిన కూడా ఆయనకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. దాంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయాడు…
ప్రస్తుతం తన కొడుకు అయిన జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో జయకృష్ణ లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన్ని చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మరో కుర్ర హీరో దొరికాడనిపిస్తోంది. ఈ సినిమాని ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తుండటం విశేషం… ఇక శ్రీనివాస మంగాపురం సినిమా కథ మొత్తం తిరుపతి సరౌండింగ్ లో జరుగుతుంది…
ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఒక అనుకోని సంఘటనలు జరగడంతో వాళ్ళిద్దరూ ఏం చేశారు… ఆ ఊరి పెద్దమనిషి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడా లేదంటే వాళ్లు విడిపోవడానికి బాధ్యుడు అయ్యాడా అనే కథ తో ఈ సినిమా తెరకెక్కుతుంది…మొత్తానికైతే ఈ మూవీ జయకృష్ణ కి పెర్ఫెక్ట్ డెబ్యూ సినిమా గా మారుతుందని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు…